వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి : ఎంపీపీ

ABN , First Publish Date - 2022-09-10T05:30:00+05:30 IST

వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి : ఎంపీపీ

వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి : ఎంపీపీ

ఘట్‌కేసర్‌ రూరల్‌, సెప్టెంబరు 10 : వర్షాల పట్ట అప్రమత్తంగా ఉండాలని ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి ప్రజలకు సూచించారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు నిండిపోయాయి. దీంతో మండల పరిధిలోని ఎదులాబాద్‌ లక్ష్మీనారాయణ చెరువు అలుగు పారుతోంది. గుండ్లకుంట చెరువు, వెంకటాపూర్‌లోని నాడెం చెరువు, తెనుగూడెంలోని కుమ్మరికుంటలోకి వర్షపు నీరుచేరి నిండుకుండలా మారాయి. కాచవానిసింగారంలో నారాయణరావు చానెల్‌ కాలువ నిండుగా ప్రవహిస్తోంది. శనివారం ఉదయం ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి ఈమేరకు నారాయణరావు చానెల్‌ కాలువను పరిశీలించారు. వైఎస్‌ ఎంపీపీ జంగమ్మ, వార్డుసభ్యులు లలిత, నాయకులు ప్రభంజన్‌గౌడ్‌, బసవ రాజుగౌడ్‌, రత్నాకర్‌, అశోక్‌, శివరాజు, రైతులు పాల్గొన్నారు.


Read more