అసంక్రమిక వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2022-11-25T00:00:44+05:30 IST

అసంక్రమిక వ్యాధులపై అప్రమత్తంగా వ్యవహరించాలని అసంక్రమిక వ్యాధుల నివారణ ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ మరియా అఫ్రీన్‌ అన్నారు.

అసంక్రమిక వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
సమావేశంలో మాట్లాడుతున్న డాక్టర్‌ మరియా అఫ్రీన్‌

వికారాబాద్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : అసంక్రమిక వ్యాధులపై అప్రమత్తంగా వ్యవహరించాలని అసంక్రమిక వ్యాధుల నివారణ ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ మరియా అఫ్రీన్‌ అన్నారు. గురువారం అనంతగిరిలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం సమావేశం హాల్‌లో ఎన్‌సీడీ సూపర్‌వైజర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం, సమీక్ష సమావేశం నిర్వహించారు. మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్‌, గుండె జబ్బులు తదితర వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూపర్‌వైజర్లకు సూచించారు. రోగులను గుర్తించి తగిన వైద్య సేవలు సేవలు అందించాలని చెప్పారు. ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ రేణుకుమార్‌ మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో ప్రజలకు అసంక్రమిక వ్యాధులపై అవగాహన కల్పించాలని ఆరోగ్య, ఆశాకార్యకర్తలకు సూచించారు. వ్యాధులతో బాధపడుతున్న వారి ఇంటింటికీ తిరిగి చికిత్స అందించాలని, ప్రగతి నివేదికలు తయారు చేసి పంపించాలని ఆయన తెలిపారు. హెల్త్‌ ఎడ్యుకేటర్‌ రజిత, ఎన్‌సీడీ సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-25T00:00:58+05:30 IST

Read more