ఆత్మగౌరవం పెంచేందుకే బతుకమ్మ చీరలు

ABN , First Publish Date - 2022-10-01T05:46:11+05:30 IST

ఆత్మగౌరవం పెంచేందుకే బతుకమ్మ చీరలు

ఆత్మగౌరవం పెంచేందుకే బతుకమ్మ చీరలు
షాద్‌నగర్‌రూరల్‌: మొగిలిగిద్దలో చీరలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌

షాద్‌నగర్‌రూరల్‌/కొందుర్గు/కందుకూరు/చేవెళ్ల/మొయినాబాద్‌/మొయినాబాద్‌ రూరల్‌/ తలకొండపల్లి/శంషాబాద్‌, సెప్టెంబరు 30: మహిళల ఆత్మగౌరవం పెంచేందుకే బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ అన్నారు. ఫరూఖ్‌నగర్‌ మండలం మొగిలిగిద్ద గ్రామంలో శుక్రవారం బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. అలాగే మండలంలోని శేరిగూడలో ఎంపీపీ ఖాజాఇద్రీస్‌, జడ్పీటీసీ వెంకట్‌రాంరెడ్డి చీరలు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమంలో జడ్పీ వైస్‌చైర్మన్‌ ఈట గణేష్‌, సర్పంచులు లలిత, ప్రశాంత్‌రెడ్డి ఎంపీటీసీలు శ్రీశైలం, జయలక్ష్మి, ఎంపీడీవో వినయ్‌ కుమార్‌, టీఆర్‌ఎస్‌ మండల శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్‌ నాయక్‌, నాయకులు రాము, కృష్ణ పాల్గొన్నారు. అదేవిధంగా కొందుర్గులోని తంగళ్లపల్లిలో జడ్పీటీసీ ఎదిరె రాగమ్మ బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ బాల్‌రాజ్‌, ఉపసర్పంచ్‌ నర్సింలుగౌడ్‌, మాజీసర్పంచులు రామకృష్ణ, కార్యదర్శి మహేందర్‌ పాల్గొన్నారు. అదేవిధంగా కందుకూరులో సర్పంచ్‌ సాధ మల్లారెడ్డి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఉపసర్పంచ్‌ తాళ్ల పద్మమ్మ, కో-ఆప్షన్‌ మెంబర్‌ బొక్క బాల్‌రెడ్డి, వార్డుసభ్యులు శేఖర్‌రెడ్డి, మమత, సునీత, పంచాయతీ కార్యదర్శి కార్తీక్‌ పాల్గొన్నారు. అదేవిధంగా చేవెళ్ల మండలంలోని కౌకుట్ల గ్రామంలో జడ్పీటీసీ మర్పల్లి మాలతికృష్ణరెడ్డి మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. సర్పంచ్‌ గాయాత్రిగోపాలకృష్ణ, ఉపసర్పంచ్‌ ఇనాయాత్‌, రైతుసంఘం కమిటీ సభ్యుడు నాగర్జున్‌రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా మొయినాబాద్‌ మండలంలోని నక్కలపల్లి, బాకారం జాగీర్‌ తదితర గ్రామాల్లో సర్పంచులు అంజయ్యగౌడ్‌, రాఘవరెడ్డిలు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. అదేవిధంగా తలకొండపల్లి మండలంలోని మెదక్‌పల్లిలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్‌ థరణి శివశంకర్‌రెడ్డి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ నరేశ్‌,  కార్యదర్శి రమేశ్‌, నాయకులు శంకర్‌, రాజు, యాదమ్మ ఉన్నారు. వెంకట్రావ్‌పేటలో సర్పంచ్‌ కంచెహైమావతి, ఎంపీటీసీ సరితగణేశ్‌ గుప్త మహిళలకు చీరలు పంపిణీ చేశారు. గడ్డమీది తండా సర్పంచ్‌ ఈశ్వర్‌నాయక్‌, ఉపసర్పంచ్‌ రవి పాల్గొన్నారు. అదేవిధంగా శంషాబాద్‌లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుష్మారెడ్డి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లతో పాటు మహిళా సంఘాల మహిళలు పాల్గొన్నారు.  

Read more