అంబరాన్నంటిన బతుకమ్మ సంబురాలు

ABN , First Publish Date - 2022-10-03T05:54:46+05:30 IST

అంబరాన్నంటిన బతుకమ్మ సంబురాలు

అంబరాన్నంటిన బతుకమ్మ సంబురాలు
చుక్కాపూర్‌లో బతుకమ్మ వేడుకల్లో ఎంపీపీ, జడ్పీటీసీ

తలకొండపల్లి/ఆమనగల్లు, అక్టోబరు 2: తలకొండపల్లి మండలంలోని చుక్కాపూర్‌లో ఆదివారం బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. ఉప్పల చారిటబుల్‌ ట్ర్‌స్ట్‌, మండల పరిషత్‌ సంయుక్త ఆఽధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి జడ్పీటీసీ ఉప్పల వెంకటేశ్‌, ఎంపీపీ నిర్మలశ్రీశైలంగౌడ్‌, ఉప్పల చారిటబుల్‌ ట్రస్ట్‌ డైరెక్టర్‌ ఉప్పల మంజుల ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. వేడుకల్లో మహిళలు, యువతులు, విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బతుకమ్మ ఆట, పాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ కిష్టమ్మ, మాజీ ఎంపీటీసీ యాదయ్య, ఉపసర్పంచ్‌ శ్రీనివా్‌సరెడ్డి, నాయకులు రంగారెడ్డి, శ్రీశైలం, పాల్గొన్నారు. ఆమనగల్లు పట్టణంలోని శిశుమందిర్‌ పాఠశాల ఆవరణలో ఆదివారం సాయంత్రం శృతిలయ కల్చరల్‌ అకాడమీ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు.  

Read more