కలెక్టరేట్‌లో ఘనంగా బతుకమ్మ

ABN , First Publish Date - 2022-09-27T04:50:15+05:30 IST

జిల్లా కలెక్టరేట్‌లో బతుకమ్మ పండగను ఎంతో ఘనంగా

కలెక్టరేట్‌లో ఘనంగా బతుకమ్మ
కలెక్టరేట్‌ వద్ద బతుకమ్మ ఆడుతున్న మహిళా ఉద్యోగులు

రంగారెడ్డి అర్బన్‌, సెప్టెంబరు 26 : జిల్లా కలెక్టరేట్‌లో బతుకమ్మ పండగను ఎంతో ఘనంగా నిర్వహించుకున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ది, పంచాయతీ రాజ్‌శాఖ ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకలో జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియతో కలిసి బతుకమ్మను ప్రారంభించారు. ఈ సందర్బంగా బతుకమ్మకు దూప, దీప, నైవేద్యాలను సమర్పించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ పూలను పూజించే సాంస్కృతికి సంప్రదాయాలు ఒక్క తెలంగాణలోనే ఉందన్నారు. మహిళలు అంతా ఒక చోట చేరి జరుపుకునే పండగని, ఈ బతుకమ్మ పండగ మహిళలను గౌరవించి వారి ఔనత్యాన్ని చాటి చెప్పే పండగని తెలి పారు. ఈ వేడుకలో డీఆర్‌డీఏ పీడీ ప్రభా కర్‌, ఏవో ప్రమీల, సిబ్బంది పాల్గొన్నారు. 


మైసిగండిలో ప్రారంభమైన శరన్నవరాత్రులు

కడ్తాల్‌ : కడ్తాల మండలం మైసిగండి శివరామాలయంలో దసరా శరన్నవరాత్సోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. పది రోజులపాటు కొనసాగే ఉత్సవాల కోసం శివరామాలయాలను శోభాయమానంగా, సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈఓ స్నేహలతతో కలిసి ఆలయ ఫౌండర్‌ట్రస్టీ రామావత్‌ సిరోళీపంతూ ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. ఉదయం అమ్మవారికి సుప్రభాత సేవతో మేలుకొలుపు పాడారు. అనంతరం అమ్మవారి మూలవిరాట్‌ను పట్టు వస్ర్తాలతో అలంకరించి పూజలు నిర్వహించారు. గణపతి పూజతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ధ్వజారోహణం, పూర్ణకుంభం, అం కురార్పణ, కలశ పూజలో భక్తులు పాల్గొన్నారు. చండీహోమంలో తహసీల్దార్‌ ఆర్‌పీ.జ్యోతిఅరుణ్‌ దంపతులు పాల్గొన్నారు.  దసరా శరన్నవరాత్సోత్సవాలలో భాగంగా మైసిగండి శివరామాలయంలో తొలిరోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ కమ్లీమోత్యనాయక్‌, సర్పంచ్‌ తులసీరామ్‌ నాయక్‌, టీపీసీసీ సభ్యుడు అయిళ్ల శ్రీనివాస్‌ గౌడ్‌ , ఉప సర్పంచ్‌ రాజారాం, మాజీ ఉప సర్పంచ్‌ పాండు నాయక్‌, ఉత్సవ నిర్వాహకుడు రామావత్‌ భాస్కర్‌,  అర్చకులు అమూళ్యపతి, భానుప్రకాశ్‌, మురళీధర్‌శర్మ,నాగేందర్‌ శర్మ, ఆలయ సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.  


కన్యకాపరమేశశ్వరీ ఆలయంలో...

ఆమనగల్లు :  ఆమనగల్లు శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో సోమవారం దసరా శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం అమ్మవారికి సుప్రభాతసేవతో మేలుకొలుపు పాడి ఉత్సవ విగ్రహాన్ని పట్టువస్త్రాలతో అలంకరించి గణపతి, అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారు తొలిరోజు శ్రీబాలత్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అదేవిధంగా హోమం, దుర్గామాత పూజల్లో భక్తులు, ఆలయ నిర్వాహకులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టీ చైర్మన్‌ బిమాండ్ల యాదయ్య, వైస్‌ చైర్మన్‌ బికుమాండ్ల పాండయ్య, ఆలయ  కమిటీ అధ్యక్షుడు వీరబొమ్మ రామ్మోహన్‌,, ప్రధాన కార్యదర్శి బికుమాండ్ల నర్సింహ, కోశాధికారి బికుమాండ్ల శ్రీనివాస్‌, ఆర్యవైశ్య సంఘం నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు కాసుల కృష్ణయ్య, నటరాజ్‌ యాదయ్య, రాజలింగం, విజయ్‌, జూలూరు గోపాల్‌, బొజ్జ నర్సింహ్మ, వెంకటయ్య, బికుమాండ్ల వాసు, దొంతు పెంటయ్య, వాస శ్రీనివాస్‌, చంద్రశేఖర్‌, బికుమాండ్ల శ్రీను, సామలకృష్ణయ్య, అర్చకులు నాగఫణి శర్మ, నయనాచారి తదిరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఆమనగల్లు కట్టమైసమ్మ దేవాలయాలలో దేవి నవరాత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కడ్తాల పాలశీతలీకరణ కేంద్రం ఆవరణలో దుర్గామాత భక్త మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన పూజల్లోభక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. Read more