బసవ భవన్‌ భూమిపూజకు తరలిరావాలి

ABN , First Publish Date - 2022-09-25T05:30:00+05:30 IST

బసవ భవన్‌ భూమిపూజకు తరలిరావాలి

బసవ భవన్‌ భూమిపూజకు తరలిరావాలి
వికారాబాద్‌ : బసవేశ్వరుడి విగ్రహానికి పూలమాల వేస్తున్న ఎంపీ బీబీ పాటిల్‌

  • వీరశైవ లింగాయత్‌లకు ఎంపీ బీబీ పాటిల్‌ పిలుపు 

వికారాబాద్‌, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : వచ్చేనెల రెండవ తేదీన హైదరాబాద్‌లోని కోకాపేట్‌లో నిర్మించతలపెట్టిన బసవ భవన్‌ భూమి పూజ కార్యక్రమానికి వికారాబాద్‌ జిల్లా నుంచి వేలాదిగా తరలి రావాలని జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ పిలుపునిచ్చారు. ఆదివారం ఎన్నేపల్లిలో శ్రీజగజ్యోతి బసవేశ్వర విద్యా సంస్థ ఆవరణలో నిర్వహించిన బసవ ఆరాధనకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లో బసవ భవన్‌ నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ కోకాపేట్‌లో ఎకరా స్థలం కేటాయించి రూ.10 కోట్ల నిధులు మంజూరు చేశారన్నారు. సీఎం సహకారంతోనే ట్యాంక్‌బండ్‌పై బసవేశ్వరుడి విగ్రహ ం ఏర్పాటు చేయగలిగామని, బసవేశ్వర జయంతి వేడుకలు ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించేలా కృషి చేశామని చెప్పారు. వీరశైవ లింగాయత్‌లను ఓబీసీ జాబితాలో చేర్చేవిధంగా కృషి చేస్తున్నామని, ఓబీసీ జాబితాలో చేర్చాలని కోరుతూ తెలంగాణ బీసీ కమిషన్‌, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేశాయని, ఓబీసీ జాబితాలో చేర్చే విధంగా తాము కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. వికారాబాద్‌లో శ్రీజగజ్యోతి బసవేశ్వర విద్యా సంస్థ స్థలంలో బసవ భవన్‌ నిర్మాణానికి తనవంతు పూర్తి సహకారం అందజేస్తానని ఆయన హామీ ఇచ్చారు. కాగా, ఎంపీ బీబీ పాటిల్‌, తెలంగాణ బీసీ కమిషన్‌ సభ్యుడు శుభప్రద్‌ పటేల్‌, హేరూరు విజయకుమార్‌, శంకర్‌పాటిల్‌, ఉమాకాంత్‌ పాటిల్‌, శివశరణప్ప, జయప్రకాష్‌, సతీష్‌, బసవరాజ్‌లను సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో శ్రీజగజ్యోతి బసవేశ్వర విద్యా సంస్థ అధ్యక్షుడు ఎన్‌.బసవరాజ్‌, వీరశైవ సమాజం అధ్యక్షుడు విజయకుమార్‌, ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్‌, కోశాధికారి విజయకుమార్‌, ఉపాధ్యక్షుడు బిచ్చప్ప, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ డా. ముద్దదీప, డాక్టర్‌ భక్తవత్సలం, ఆత్మలింగం, శివరాజ్‌, వీరేశం, వీరన్న, బసవలింగం, లవకుమార్‌, సంపూర్ణ ఆనంద్‌, సుధామ్ఫ్‌ పటేల్‌, రాజశేఖర్‌, డాక్టర్‌ శాంతప్ప, మల్లేశం, గాండ్ల వీరేశం, కపిల్‌, కోటిలింగం, కిషోర్‌, రాకేష్‌ తదితరులు పాల్గొన్నారు.

  • వీరశైవ లింగాయత్‌లకు ప్రత్యేక గుర్తింపు

తాండూరు : రాష్ట్ర ప్రభుత్వం వీరశైవ లింగాయత్‌లకు ప్రత్యేక గుర్తింపునిస్తుందని బీబీ పాటిల్‌ పేర్కొన్నారు. తాండూరు పట్టణం శ్రీభావిగి భద్రేశ్వరస్వామి దేవాలయంలో వీరశైవ సమాజం అధ్యక్షుడు పటేల్‌ శ్రీశైలం అధ్యక్షతన ఏర్పాటు చేసిన సంఘం సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో బసవ జయంతిని అధికారికంగా నిర్వహించడంతోపాటు ట్యాంక్‌ బండ్‌పై బసవేశ్వరుని విగ్రహం ఏర్పాటు చేయించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రాష్ట్రం బీసీ కమిషన్‌ సభ్యులు శుభప్రద్‌పటేల్‌ మాట్లాడుతూ వీరశైవులను ఓబీసీలో చేర్చేందుకు కృషి చర్చలు జరుగుతున్నాయని, ఎన్‌సీబీసీ సోషల్‌ జస్టిస్‌ మంత్రిత్వ శాఖలకు నివేదికలందించడం జరిగిందన్నారు. బసవ భవన్‌ భూమిపూజకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. సంఘం సభ్యులు ఎంపీ, బీసీ సంఘం సభ్యులు శుభ ప్రద్‌పటేల్‌ను సన్మానించి జ్ఞాపికను అందజేశారు. వీరశైవ సమాజం ప్రతినిధులు హేరూర్‌ విజయ్‌కుమార్‌, ఉమాకాంత్‌ పటేల్‌, గాజుల శాంత్‌కుమార్‌, అగ్గనూరు జగదీశ్వర్‌, పటేల్‌ విజయ్‌కుమార్‌, వాలి శాంత్‌కుమార్‌, కౌన్సిలర్‌ లావణ్య భద్రేశ్వర్‌, భద్రేశ్వరదేవస్థానం చైర్మన్‌ తదితరులు పాల్గొన్నారు.

  •  సంఘటితమై సమస్యలు  పరిష్కరించుకుందాం

పరిగి : వీరశైవులంగా సంఘటితంగా ఏర్పడి సమస్యలను పరిష్కరించుకుందామని ఎంపీ బీబీ పాటిల్‌ అన్నారు. పరిగి మునిసిపల్‌ పరిధిలోని శ్రీభ్రమరాంబ మల్లిఖార్జునస్వామి ఆలయ ఆవరణలో బసవభవన నిర్మాణ సన్నాహాక సమావేశానికి హాజరయ్యారు. అనంతరం బసవభవన నిర్మాణానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. పరిగిలో బసవభవన నిర్మాణానికి తనవంతుగా రూ.3లక్షల విరాళాన్ని ఇస్తున్నట్లు తెలిపారు. దోమ వైస్‌ ఎంపీపీ మల్లేశం, రైతుబంధు మండల కో-ఆర్డినేటర్‌ కె.రాజు, నాయకులు గుండుమల్ల రాజేశ్వర్‌, బుక్క శ్రీకాంత్‌, విజయ్‌కుమార్‌, శ్రీధర్‌, వీరన్న, ప్రవీణ్‌, తదితరులు పాల్గొన్నారు. 

  • వీరశైవ లింగాయత్‌లు అన్ని రంగాల్లో రాణించాలి 

కొడంగల్‌ : వీరశైవ లింగాయత్‌ సభ్యులు అన్ని రంగాల్లో రాణించాలని బీబీ పాటిల్‌ పిలుపునిచ్చారు. కొడంగల్‌ పట్టణంలో శ్రీజగద్గురు నిరంజన మఠం అధ్యక్షుడు, ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎంపీ హాజరై మాట్లాడారు. అనంతరం మఠం పీఠాధిపతి శ్రీ సిద్ధిలింగ మహాస్వామి మాట్లాడుతూ బసవ భవన్‌ శంకుస్థాపన కార్యక్రమానికి కొడంగల్‌ నియోజకవర్గంలోని వీరశైవలింగాయత్‌లు అధిక సంఖ్యలో తరలి రావాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.


Updated Date - 2022-09-25T05:30:00+05:30 IST