కమ్యూనిటీ పోలీసింగ్‌పై అవగాహన

ABN , First Publish Date - 2022-04-25T05:05:02+05:30 IST

కమ్యూనిటీ పోలీసింగ్‌పై అవగాహన

కమ్యూనిటీ పోలీసింగ్‌పై అవగాహన

కొడంగల్‌ రూరల్‌, ఏప్రిల్‌ 24: ఎస్పీ కోటిరెడ్డి, పరిగి డీఎస్పీ శ్రీనివాస్‌ ఆదేశానుసారం కమ్యూనిటీ పోలీసింగ్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. శనివారం రాత్రి మండల పరిధిలోని హస్నాబాద్‌లో కొడంగల్‌ ఎస్సై ఎ.రవి ఆధ్వర్యంలో పోలీసు కళాబృందం ఆధ్వర్యంలో కళాజాత నిర్వహించారు. మహిళలపై జరుగుతున్న నేరాలు, డయల్‌ 100, షీ టీం, సీసీ కెమెరాలు, బాల్యవివాహాలు, బాలకార్మిక వ్యవస్థ, మానవ అక్రమ రవాణా, కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మద్యపాన నిషేధం, సైబర్‌ నేరాలు, గంజాయి నిర్మూలన, డ్రగ్స్‌ నిషేధం తదితర అంశాలపై కళాజాత బృందం సభ్యులు ఆటపాటలతో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గ్రామస్తులు, పోలీసు సిబ్బంది యాదయ్యగౌడ్‌, కళాజాత బృందం సభ్యులు అశోక్‌, ఆంజనేయులు, హన్మంతు, వెంకటేశ్‌, యాదయ్య, ప్రదీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Read more