తడి, పొడిచెత్తపై మహిళలకు అవగాహన

ABN , First Publish Date - 2022-08-18T05:16:51+05:30 IST

తడి, పొడిచెత్తపై మహిళలకు అవగాహన

తడి, పొడిచెత్తపై మహిళలకు అవగాహన

దోమ, ఆగస్టు 17:  మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో సాహస్‌ స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ శ్యామ్‌, సర్పంచ్‌ రాజిరెడ్డి తడి,పొడి చెత్తపై మహిళలకు అవగాహన కల్పించారు. బుధవారం పంచాయతీ కార్యాలయంలో మహిళలతో సమావేశం ఏర్పాటుచేసి తడి, పొడి చెత్తను ఏ విధంగా వేరు చేయాలనే దానిపై వివరించారు. ప్రతీ ఒక్కరూ గ్రామ పరిశుభ్రతకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read more