పాత కక్షలతో వ్యక్తిపై దాడి

ABN , First Publish Date - 2022-11-02T23:47:12+05:30 IST

పాత కక్షలను దృష్టిలో ఉంచుకొని ఓ వ్యక్తిపై మరో వ్యక్తి దాడి చేసిన ఘటన మండల పరిధిలోని ఎకమామిడిలో బుధవారం చోటుచేసుకుంది.

పాత కక్షలతో వ్యక్తిపై దాడి

నవాబ్‌పేట్‌, నవంబరు 2: పాత కక్షలను దృష్టిలో ఉంచుకొని ఓ వ్యక్తిపై మరో వ్యక్తి దాడి చేసిన ఘటన మండల పరిధిలోని ఎకమామిడిలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మమ్మద్‌ సమీయోద్దీన్‌కు వికారాబాద్‌ మండలం రాజీవ్‌నగర్‌ కాలనీకి చెందిన అలీషాతో గత కొన్నేళ్లుగా వివాదాలు నడుస్తున్నాయి. బుధవారం అలీషా ఎకమామిడి గ్రామానికి వచ్చి సమీయోద్దీన్‌పై ఇనుప రాడ్‌తో దాడి చేశాడు. అడ్డుకున్న తల్లి ముంతాజ్‌, భార్య షాజహాన్‌లకు గాయాలయ్యాయి, సమీయోద్దీన్‌కు బలమైన గాయాలు తగలడంతో చికిత్స నిమిత్తం వికారాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు పోలీ్‌సలు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-11-02T23:47:12+05:30 IST
Read more