వికారాబాద్‌లో అతి రుద్ర మహాయజ్ఞం

ABN , First Publish Date - 2022-12-12T23:15:14+05:30 IST

వికారాబాద్‌ పట్టణంలో ఈ నెల 21 నుండి 27 వరకు అతి రుద్ర మహాయజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆధ్యాత్మిక సేవా మండలి సభ్యుడు సుభాష్‌ పంతులు పేర్కొన్నారు.

వికారాబాద్‌లో అతి రుద్ర మహాయజ్ఞం
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఆధ్యాత్మిక సేవా మండలి సభ్యులు

21 నుండి 27 వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు

వికారాబాద్‌, డిసెంబరు 12 : వికారాబాద్‌ పట్టణంలో ఈ నెల 21 నుండి 27 వరకు అతి రుద్ర మహాయజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆధ్యాత్మిక సేవా మండలి సభ్యుడు సుభాష్‌ పంతులు పేర్కొన్నారు. సోమవారం వికారాబాద్‌ పట్టణంలోని చిగుళ్లపల్లి మైదానంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికారాబాద్‌ పట్టణంలో 11 సంవత్సరాలుగా రుద్రాభిషేక కార్యక్రమాలను నిర్వహించామని, 12వ సంవత్సరం ఈ సారి అతిరుద్ర మహాయజ్ఞం నిర్వహిస్తున్నామని చెప్పారు. అతిరుద్ర మహాయజ్ఞంలో శ్రీ మహగణపతి, శతచండి, రాజ శ్యామల, మహా సుదర్శన, సంతతధారాభిషేక యుక్త శాంతి కల్యాణసప్తాహ మహోత్సవాలను నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో 150 మంది వేద పండితులు పాల్గొంటారని, భక్తులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించడతో పాటు భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమావేశంలో ఆధ్యాత్మిక మండలి సభ్యులు రాజు, చిగుళ్లపల్లి రమేష్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-12T23:15:14+05:30 IST

Read more