అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2022-10-11T05:40:15+05:30 IST

అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యం పట్టివేత

కొడంగల్‌ రూరల్‌, అక్టోబరు, 10: దోమ మండలం బుద్లాపూర్‌ నుంచి కర్ణాటక రా ష్ట్రం గుర్మిట్‌కాల్‌కు తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్సై ఎ.రవిగౌడ్‌ తెలిపారు. కొడంగల్‌ పట్టణ శివారులో వాహనాలను తనిఖీలు చేస్తుండగా బొలెరో(టీఎస్‌07 యుఏ6940) వాహనంలో బియ్యాన్ని గుర్తించినట్లు తెలిపారు. పట్టుబడిన రేషన్‌ బియ్యంపై సివిల్‌ సప్లయీస్‌ డిప్యుటీ తహసీల్దార్‌కు సమాచారం అందించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Read more