టీఎస్‌ ఐపాస్‌ కింద 38 యూనిట్లకు ఆమోదం

ABN , First Publish Date - 2022-03-04T05:43:41+05:30 IST

టీఎస్‌ ఐపాస్‌ కింద 38 యూనిట్లకు ఆమోదం

టీఎస్‌ ఐపాస్‌ కింద 38 యూనిట్లకు ఆమోదం
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌

వికారాబాద్‌, మార్చి 3: టీఎస్‌ ఐపా్‌స(తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు - ప్రాజెక్టుల మంజూరు ప్రక్రియ) క్రింద దరఖాస్తు చేసుకున్న 38యూనిట్ల కు కమిటీ ఆమోదించిందని అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో ఇండస్ర్టియల్‌ ప్రమోషన్‌ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పారిశ్రామిక వేత్తలను ప్రొత్సహించేందుకు దరఖాస్తు చేసుకున్న 14ఎస్సీ, 24ఎస్టీలతో మొత్తం 38 మందికి యూనిట్లు మంజూరు చేశారన్నారు. మహిళా లబ్ధిదారులకు 45 శాతం, పురుషులకు 35శాతం సబ్సిడీ కల్పిస్తూ ప్రభుత్వం యూనిట్లను మంజూరు చేసిందన్నారు. వాటిలో 10 ట్రాక్టర్లు, 1 మోటార్‌ క్యాబ్‌, 3 గూడ్స్‌ వెహికల్స్‌ ఎస్సీలకు కాగా, ఎస్టీలకు 23మోటార్‌ క్యాబ్స్‌, 1పావలా వ డ్డీ యూనిట్ల ద్వారా యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి వినయ్‌కుమార్‌, వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ జోసె ఫ్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ మోజస్‌, ఎల్‌డీఎం రాంబాబు పాల్గొన్నారు.

Read more