అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆరాచక పాలన

ABN , First Publish Date - 2022-09-27T04:49:01+05:30 IST

బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆరాచక పాలన

అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆరాచక పాలన
పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పుతున్న డాక్టర్‌ మల్లు రవి

  • టీపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ మల్లు రవి 


కడ్తాల్‌, సెప్టెంబరు 26 : బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆరాచక పాలన సాగిస్తున్నాయని టీపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ మల్లు రవి, డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహ్మరెడ్డి ఆరోపించారు. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి, ఆధిపత్యాన్ని చాటుకోవడానికి కుట్రలు సాగిస్తూ.. ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తున్నాయని వారు మండిపడ్డారు. కడ్తాల మండలం రావిచెడ్‌ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ యాదయ్యతోపాటు మరో 100మంది టీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సోమవారం కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు యాట నర్సింహ, రావిచెడ్‌ సర్పంచ్‌ భారతమ్మవిఠలయ్యగౌడ్‌, మాజీ సర్పంచ్‌ మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. మాదారం గేటు సమీపంలోని వైఎన్‌ఆర్‌జీ గార్డెన్‌లో పార్టీలో చేరినవారికి కాంగ్రెస్‌ కండువాలు కప్పి స్వాగతించారు. అనంతరం జరిగిన సమావేశంలో మల్లురవి, చల్లా నర్సింహ్మరెడ్డి మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన కాకుండా రాచరిక, పోలీసు రాజ్యం కొనసాగుతుందన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలకు పార్టీ ఫిరాయింపులపై ఉన్న ధ్యాస ప్రజాసంక్షేమంపై లేదన్నారు. రాహుల్‌ జోడో యాత్రకు లభిస్తున్న స్పందనను చూసి బీజేపీలో వణుకు మొదలైందని, మత రాజకీయాలతో ప్రజల మధ్య విద్వేషాలను పెంచుతూ దేశంలో అశాంతికి ఆజ్యం పోస్తుందన్నారు. బండి సంజయ్‌ చేపట్టిన పాదయాత్రతో ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని, యాత్ర జరిగిన ప్రాంతాలలో ప్రజల మధ్య చిచ్చుపెట్టిందని ఆరోపించారు. దేశ సంపదను మోడి సర్కార్‌ కార్పోరేట్‌ శక్తులకు దోచిపెడుతుందని, లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేస్తూ వాటి ఆస్తులను ఆదాని, అంబానిలకు ధారదత్తం చేస్తుందని మండిపడ్డారు. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ పాలన నయా నిజాం ను తలపిస్తుందని విమర్శించారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలు , ప్రజా వ్యతిరేక విధానాలను కాంగ్రెస్‌ శ్రేణులు సమర్థవంతంగా తిప్పికొట్టి అధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు ఆయిళ్ల శ్రీనివా్‌సగౌడ్‌, డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్‌ రెడ్డి, బ్లాక్‌ కాంగ్రె్‌సఅధ్యక్షుడు బీక్యనాయక్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ చేగూరి వెంకటేశ్‌, యువజన కాంగ్రెస్‌ మండల ఽఅధ్యక్షుడు హీరాసింగ్‌, మండల కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బీచ్యనాయక్‌, నాయకులు బుచ్చయ్య, జవహర్‌లాల్‌ నాయక్‌, నేజ్యనాయక్‌, మహిపాల్‌ రెడ్డి, జగన్‌, శ్రీశైలం, సంతో్‌షకుమార్‌, రవి, ప్రశాంత్‌, శ్రీకాంత్‌, నరేశ్‌, జనార్ధన్‌గౌడ్‌ పాల్గొన్నారు. Read more