గుర్తు తెలియని మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2022-09-27T05:30:00+05:30 IST

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

కీసర రూరల్‌, సెప్టెంబరు 27 : గుర్తుతెలియని మృతదేహాన్ని నాగారం మున్సిపాలిటీ రాంపల్లి పెద్ద చెరువు వద్ద మంగళవారం కీసర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడు సుమారు 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండి, 5.6 అడుగుల ఎత్తుతో పాటు నలుపు రంగు చొక్కా, బూడిద రంగు ప్యాంటుతో పాటు తెలుపు రంగు బనియన్‌ ధరించి ఉన్నాడని పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ రఘువీర్‌రెడ్డి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు తెలిసిన వారు ఫోన్‌- 7680923398 నెంబర్‌కు, ప్రత్యక్షంగానైనా పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేసారు.


వికారాబాద్‌ ఆర్టీసీ డీఎంకు ఉత్తమ అవార్డు

వికారాబాద్‌/పరిగి, సెప్టెంబరు 27: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వికారాబాద్‌ ఆర్టీసీ డిపో మొదటి  స్థానంలో నిలవడంతో మంగళవారం హైదరాబాద్‌ ఆర్టీసీ కళా భవన్‌ లో సజ్జనార్‌ చేతుల మీదుగా వికారా బాద్‌ డీఎం ఉత్తమ అవార్డును అందుకున్నారు. ఆదా యంలో ఉత్తమ సేవలు అందించడంలో వికారాబాద్‌ డిపో ముందు వరుసలో ఉందని డీఎం మహేష్‌ తెలి పారు. ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిం దన్నారు. అదేవిధంగా ఉత్తమ సేవలు అందించిన అందించిన ఎనిమిది మంది పరిగి ఆర్టీసీ ఉద్యోగులకు ఆ సంస్థ ఎండీ సజ్జనార్‌ ఆవార్డులు అంద జేశారు. సరిత(కండక్టర్‌), ఎం.రవి(డ్రైవర్‌). జి.వెంకటేశ్వర్లు(డ్రైవర్‌), ఎండీ మహబూబ్‌అలీ(మెకానిక్‌), ఎండీ అన్వర్‌(ఏఈ మెకానికల్‌), ఎం.లక్ష్మీ(కండక్టర్‌), ఎం.శంకర్‌(పీహెబీ డ్రైవర్‌), జి.చంద్రయ్య(కండక్టర్‌)లు హైయ్యెస్ట్‌ ఇన్సెంటీవ్స్‌, ఆయిల్‌ సేవ్‌డ్‌, ఆక్యుపెన్సీ విభా గాల్లో అవార్డులు, ప్రశంసాపత్రాలను అందు కున్నారు. ఈ సందర్భంగా మంగళవారం పరిగి డిపో మేనేజర్‌ పవిత్ర కూడా వారిని అభినందించారు.


Read more