బడీడు పిల్లలందరినీ బడిలో చేర్పించాలి

ABN , First Publish Date - 2022-06-07T05:36:34+05:30 IST

బడీడు పిల్లలందరినీ బడిలో చేర్పించాలి

బడీడు పిల్లలందరినీ బడిలో చేర్పించాలి
ప్రతా్‌పసింగారంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తున్న టీచర్లు

కులకచర్ల/ఘట్‌కేసర్‌ రూరల్‌/పూడూర్‌, జూన్‌ 6: బడి ఈడు పిల్లలందరినీ బడిలో చేర్పించాలని ముజాహిత్‌పూర్‌సర్పంచ్‌ లక్ష్మీఆనంద్‌ అన్నారు. బడిబాటలలో భాగంగా సోమవారం గ్రామంలో ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. తమ పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. సర్పంచ్‌ మాట్లాడుతూ విద్య ద్వారానే మనిషి పురోగతన్నారు. హెచ్‌ఎం సుదర్శన్‌రావు, ఉపాధ్యాయులు వెంకటేశం, కల్పన, మంజుల, సీఆర్‌పీరాజు పాల్గొన్నారు. ఘట్‌కేసర్‌ మండలం ప్రతా్‌పసింగారంలో బడిబాట నిర్వహించారు. సర్పంచ్‌ వంగూరి శివశంకర్‌, హెచ్‌ఎం రవికుమార్‌, ఉపాధ్యాయులతో గ్రామంలో తిరిగి పిల్లలను స్కూలుకు పంపాలని సూచించారు. ఐదేళ్లు నిండిన ప్రతీ బాలబాలికలను బడిలో చేర్పించాలన్నారు. టీచర్లు సత్యనారాయణ, పద్మావతి, రమేష్‌, ఎస్‌ఎంసీ చైర్‌పర్సన్‌ రాజేశ్వరి పాల్గొన్నారు. భవిష్యత్తుకు ప్రభుత్వ పాఠశాలలు భరోసా అని ప్రధానోపాధ్యాయుడు మధు అన్నారు. బడిబాటలో భాగంగా పూడూర్‌ మండల పరిధి కడుమూర్‌లో తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కరపత్రాలు పంపిణీ చేవారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందు తుందన్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల బోధన ప్రారంభమవుతుందన్నారు. టీచర్లు హరీశ్‌, సంపత్‌, సాయికుమార్‌, సీఆర్పీ మల్లేశ్‌, అంగన్‌వాడీ టీచర్‌ వెంకటమ్మ పాల్గొన్నారు.

Updated Date - 2022-06-07T05:36:34+05:30 IST