తిమ్మాపూర్‌లో అన్ని ప్యాసింజర్‌ రైళ్లను నిలపాలి

ABN , First Publish Date - 2022-08-10T06:17:02+05:30 IST

తిమ్మాపూర్‌లో అన్ని ప్యాసింజర్‌ రైళ్లను నిలపాలి

తిమ్మాపూర్‌లో అన్ని ప్యాసింజర్‌ రైళ్లను నిలపాలి
రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌కు వినతిపత్రం ఇస్తున్న రవీందర్‌

కొత్తూర్‌, ఆగస్టు 9: తిమ్మాపూర్‌ రైల్వే స్టేషన్‌లో అన్ని ఫ్యాసింజర్‌ రైళ్లూ నిలపాలని మున్సిపల్‌ వైస్‌ఛైర్మన్‌ డోలి రవీందర్‌ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని రైలు నిలయంలో జీఎం అరుణ్‌కుమార్‌జైన్‌కు వినతిపత్రం అందజేశారు. కరోనాకు ఇక్కడ అన్ని ఫ్యాసింజర్‌ రైళ్లు నిలిచేవని, ప్రస్తుతం కొన్నింటిని మాత్రమే నిలుపుతున్నారని పేర్కొన్నారు. ఫ్యాసింజర్‌ రైళ్లు ఆపకపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.  ఇందుకు జీఎం సానుకూలంగా స్పందించారని రవీందర్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో మిస్కిన్‌, సురేష్‌, గణేష్‌, నర్సింహారెడ్డి పాల్గొన్నారు.

Read more