ఐసీడీఎస్‌ సేవలన్నీ ఒకే యాప్‌లో నమోదు

ABN , First Publish Date - 2022-11-16T00:08:39+05:30 IST

ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని అన్ని సేవలను ఒకే యాప్‌లోకి తీసుకొచ్చామని మహిళా శిశు సంక్షేమ అధికారి కెతావత్‌ లలితకుమార్‌ అన్నారు.

ఐసీడీఎస్‌ సేవలన్నీ ఒకే యాప్‌లో నమోదు
సమావేశంలో మాట్లాడుతున్న అధికారి లలితకుమార్‌

మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి కెతావత్‌ లలితకుమారి

వికారాబాద్‌, నవంబర్‌ 15: ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని అన్ని సేవలను ఒకే యాప్‌లోకి తీసుకొచ్చామని మహిళా శిశు సంక్షేమ అధికారి కెతావత్‌ లలితకుమార్‌ అన్నారు. మంగళవారం మహిళా శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో న్యూట్రిషన్‌ హెల్త్‌ ట్రాకింగ్‌ విధానంపై డీఆర్‌సీలో ఐసీడీఎస్‌ చైల్డ్‌ డెవల్‌పమెంట్‌ ఆఫీసర్లు, సూపర్‌వైజర్లకు, అంగన్‌వాడీ టీచర్లకు పోషణ అభియాన్‌ సిబ్బందికి జిల్లా స్థాయి శిక్షకులకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘న్యూట్రిషన్‌ హెల్త్‌ ట్రాకింగ్‌ సిస్టం’ అనే యాప్‌ ద్వారా అన్ని సేవలను ఒకే గొడుగు కిందకు తెచ్చామని తెలిపారు. అంగన్‌వాడీల్లో అందిస్తున్న సేవలను ఈ న్యూట్రిషన్‌ హెల్త్‌ ట్రాకింగ్‌ సిస్టం ద్వారా నమోదు చేయాల న్నారు. ఏడు నెలల నుంచి 59నెలల మధ్య ఉన్న పిల్లల్లో ఎత్తుకు తగ్గ బరువు లేని వారిని గుర్తించి వారికి పోషకాలందించాలన్నారు. న్యూట్రిషన్‌ హెల్త్‌ ట్రాకింగ్‌ సిస్టం ద్వారా రోజువారీ పర్యవేక్షణ, నెలవారీ సేవలు, ఆహార సరుకుల నిర్వహణ అంగన్‌వాడీ సమాచారం మొదలైన వాటిని నమోదు చేసి మెరుగైన సేవలందేలా కృషిచేయాలన్నారు. ట్రైనర్‌ ఆశ్రిత మాట్లాడుతూ.. ఈ యాప్‌ ద్వారా అంగన్‌వాడీ లబ్ధిదారులకు నాణ్యమైన సదుపాయాలందిస్తామన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ చైల్డ్‌ డెవల్‌పమెంట్‌ ఆఫీసర్లు జయరాం, కృష్ణవేణి, ప్రియదర్శిణి, రేణుక, కాంతారావు, వెంకటేశ్వరమ్మ, విజయలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - 2022-11-16T00:08:45+05:30 IST

Read more