వ్యవసాయంపై అవగాహన సదస్సుకు రైతులందరూ తరలిరావాలి

ABN , First Publish Date - 2022-04-24T05:37:37+05:30 IST

వ్యవసాయంపై అవగాహన సదస్సుకు రైతులందరూ తరలిరావాలి

వ్యవసాయంపై అవగాహన సదస్సుకు రైతులందరూ తరలిరావాలి

  • వ్యవసాయ శాఖ తాండూరు ఏడీ రుద్రమూర్తి

తాండూరు రూరల్‌, ఏప్రిల్‌, 23 : వచ్చే ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు ఈనెల 25న రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వ విద్యాలయంలో నిర్వహించే అవగాహన సదస్సుకు రైతులను రైతలు తరలిరావాలని వ్యవసాయశాఖ తాండూరు ఏడీ రుద్రమూర్తి పేర్కొన్నారు. శనివారం తాండూరు మండల తహసీల్దార్‌ కార్యాలయంలో వ్యవసాయాధికారులతోపాటు విస్తీర్ణాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తాండూరు వ్యవసాయశాఖ సబ్‌ డివిజన్‌ పరిధిలోని బషీరాబాద్‌, యాలాల, పెద్దేముల్‌, తాండూరు మండలాలకు చెందిన గ్రామస్థాయి రైతులను, కో-ఆర్డినేటర్లను, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సహకార సంఘం అధ్యక్షులు, మార్కెట్‌ కమిటీ చైర్మన్లకు అవగాహన  కల్పించి  అవగాహన సదస్సుకు రైతులను తరలించేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆదేశించారు.

Read more