ఐలమ్మ పోరాటాలు స్ఫూర్తిదాయకం

ABN , First Publish Date - 2022-09-27T04:45:23+05:30 IST

సాయుధపోరాటంలో వీరనారి చాకలి ఐలమ్మ ప్రదర్శించిన

ఐలమ్మ పోరాటాలు స్ఫూర్తిదాయకం
వీరనారి చాకలి ఐలమ్మ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పిస్తున్న జిల్లా అదనపు కలెక్టర్‌

రంగారెడ్డి అర్బన్‌, సెప్టెంబరు  26 : సాయుధపోరాటంలో వీరనారి చాకలి ఐలమ్మ ప్రదర్శించిన దైర్య సాహసాలు, ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయని జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ అన్నారు. చాకలి ఐలమ్మ 127వ జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఆయన ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ ప్రదర్శించిన పౌరుషం తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటి చెప్పాయని ఆయ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్‌ అధికారి విద్య, కలెక్టరేట్‌ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. 


విజ్ఞప్తులను సత్వరమే పరిష్కరించాలి

ప్రజావాణిలో స్వీకరించిన విజ్ఞప్తులను త్వరగా పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ అంశాలపై 150 దరఖాస్తులు వచ్చాయి.Read more