మహిళా చైతన్యానికి నిదర్శనం ఐలమ్మ

ABN , First Publish Date - 2022-09-27T05:45:33+05:30 IST

మహిళా చైతన్యానికి నిదర్శనం ఐలమ్మ

మహిళా చైతన్యానికి నిదర్శనం ఐలమ్మ
శంషాబాద్‌ రూరల్‌: పెద్దతూప్రలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌, ఎంపీపీ జయమ్మశ్రీనివాస్‌

  • ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ 
  • ఘనంగా ఐలమ్మ జయంతి వేడుకలు 
  • శంషాబాద్‌లో విగ్రహావిష్కరణలు


శంషాబాద్‌/శంషాబాద్‌ రూరల్‌/చేవెళ్ల/షాబాద్‌/కందుకూరు/ఇబ్రహీంపట్నం/యాచారం/ఆమనగల్లు/కడ్తాల్‌/తలకొండపల్లి/షాద్‌నగర్‌ అర్బన్‌/కొత్తూర్‌/, సెప్టెంబరు 26: తెలంగాణ మహిళా చైతన్యానికి నిదర్శనం చాకలి ఐలమ్మ అని ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌ అన్నారు. శంషాబాద్‌ మున్సిపల్‌ కేంద్రంలోని సిద్దాంతి ఊరచెర్వు పక్కన రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 127వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుష్మారెడ్డి, జడ్పీటీసీ నీరటి తన్వీరాజు, ఎంపీపీ జయమ్మ శ్రీనివాస్‌, బండి గోపాల్‌ యాదవ్‌, ఆర్‌.గణే్‌షగుప్తా, వెంకటేశ్‌గౌడ్‌, వెంకటేష్‌, శ్రీకాంత్‌యాదవ్‌ పాల్గొన్నారు. పెద్దతూప్రలో ఎంపీపీ దిద్యాల జయమ్మశ్రీనివాస్‌ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఐలమ్మ విగ్రహాన్ని ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌ ఆవిష్కరించారు.  అదేవిధంగా చేవెళ్లలో రజక సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.  ఎమ్మెల్యేతో పాటు డీసీసీ మాజీ అధ్యక్షుడు పడాల వెంకట్‌స్వామి, చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి, శివప్రసాద్‌, బాల్‌రాజ్‌, సున్నపు సత్యం, ప్రభాకర్‌, వీరేందర్‌, దేవర వెంకట్‌రెడ్డి, శైలజా ఆగిరెడ్డి, రామస్వామి, ప్రభులింగం పాల్గొన్నారు. అదేవిధంగా షాబాద్‌లోని గ్రామపంచాయతీ కార్యాలయంలో రజక సంఘం జిల్లా అధ్యక్షుడు గడ్డం చంద్రయ్య ఐలమ్మ చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రవీందర్‌, నర్సింహులు, హరికుమార్‌, రాము, శ్రీశైలం, అస్మత్‌పాష, సురేష్‌, హరీష్‌ పాల్గొన్నారు. అదేవిధంగా కందుకూరులో రజక అభివృద్ధి సంస్థ మండల అధ్యక్షుడు అక్కెనపల్లి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను జరిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండల  అధ్యక్షుడు ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి, సర్పంచ్‌ ఎస్‌.శమంతకమణి, ఎస్‌ఐ కొండల్‌, ఆనంద్‌ పాల్గొన్నారు. అదేవిధంగా ఇబ్రహీంపట్నంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఐలమ్మ పోరాట పటిమ మహిళలకు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కృపేష్‌, వైస్‌ ఎంపీపీ వెంకటప్రతా్‌పరెడ్డి, రజక సంఘం నాయకులు అజయ్‌, మడుపు గోపాల్‌ పాల్గొన్నారు. అదేవిధంగా యాచారంలో ఎంపీపీకొప్పు సుకన్యబాషా. జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మలు ఐలమ్మ చిత్రపటానికి  పూలమాల వేసి నివాళులర్పించారు. అదేవిధంగా ఆమనగల్లులోని మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన  కార్యక్రమంలో ఎంపీపీ అనితవిజయ్‌, జడ్పీటీసీ అనురాధపత్యనాయక్‌,  సర్పంచ్‌ బాల్‌రామ్‌, సూపరింటెండెంట్‌ రమేశ్‌నాయక్‌, కుమార్‌, భాస్కర్‌, విక్రమ్‌, భీమయ్య పాల్గొన్నారు. కడ్తాల బస్టాండ్‌ కూడలిలో కాంగ్రె్‌సపార్టీ, బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వేర్వేరుగా నిర్వహించిన వేడుకల్లో జడ్పీటీసీ జర్పుల దశరథ్‌ నాయక్‌, డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివా్‌సరెడ్డి, బీసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు పిప్పళ్ల వెంకటేశ్‌, బీక్యనాయక్‌, లక్ష్మీనర్సింహారెడ్డి, రామకృష్ణ, వెంకటేశ్‌, లాయక్‌అలీ పాల్గొన్నారు. తలకొండపల్లి మండల చుక్కాపూర్‌ గ్రామంలో జరిగిన వేడుకల్లో మార్కెట్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌ రెడ్డి పాల్గొని ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ కిష్టమ్మ, వెంకట్‌రెడ్డి, మల్‌రెడ్డి, శ్రీను, రాజేశ్వర్‌రెడ్డి, పాండురంగారెడ్డి, నారాయణ పాల్గొన్నారు. అదేవిధంగా షాద్‌నగర్‌ పట్టణంలోని ఐలమ్మ విగ్రహానికి పార్టీలకు అతీతంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్‌, జడ్పీ వైస్‌చైర్మన్‌ ఈటె గణేష్‌, మున్సిపల్‌ చైర్మన్‌ కె.నరేందర్‌, వైస్‌చైర్మన్‌ నటరాజ్‌, ఎంపీపీ ఖాజా ఇద్రీష్‌, జడ్పీటీసీ పి.వెంకట్‌రాంరెడ్డి నివాళులర్పించారు. షాద్‌నగర్‌ సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు వీర్లపల్లి శంకర్‌ ఆధ్వర్యంలో,  బీఎ్‌సపీ నియోజకవర్గం ఇన్‌చార్జి దొడ్డి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఐలమ్మకు ఆయా పార్టీల నాయకులు నివాళులర్పించారు. కొత్తూర్‌లోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి, ఎంపీడీవో శరత్‌చంద్రబాబు, ఎంపీవో నర్సింహులు, సర్పంచులు రవినాయక్‌, రాజు, తదితరులు ఐలమ్మకు ఘన నివాళులర్పించారు.

Read more