ఐలమ్మ పోరాటస్ఫూర్తి అనుసరణీయం

ABN , First Publish Date - 2022-09-10T05:30:00+05:30 IST

ఐలమ్మ పోరాటస్ఫూర్తి అనుసరణీయం

ఐలమ్మ పోరాటస్ఫూర్తి అనుసరణీయం
తాండూరు : ఐలమ్మ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న శుభప్రద్‌ పటేల్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజుగౌడ్‌, తదితరులు

  • ప్రజాప్రతినిధులు, నాయకులు, రజక సంఘం సభ్యులు 
  • ఆమె వర్థంతిని పురస్కరించుకొని చిత్రపటాలు, విగ్రహాల వద్ద ఘన నివాళి 

తాండూరు/తాండూరు రూరల్‌/కులకచర్ల/పరిగి/దోమ/కొడంగల్‌/బొంరా్‌సపేట్‌/పూడూర్‌/ధారూరు, సెప్టెంబరు 10 : చాకలి ఐలమ్మ పోరాటస్ఫూర్తి అనుసరణీయమని ప్రజాప్రతినిధులు, నాయకులు, రజక సంఘం సభ్యులు అన్నారు. శనివారం ఆమె 37వ వర్థంతిని పురస్కరించుకొని విగ్రహాలు, చిత్రపటాల వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పరిగి ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌రెడ్డి కులకచర్లలో మండల రజక సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ వర్థంతి వేడుకల్లో పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ హరికృష్ణ, డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు శేరి రాంరెడ్డి, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు రాంలాల్‌నాయక్‌, రజక సంఘం మండల అధ్యక్షుడు రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్‌, బొంరెడ్డిపల్లి సర్పంచ్‌ ఆంజనేయులు, లక్ష్మయ్య, కృష్ణయ్య, బాల్‌రాజ్‌, తదితరులు పాల్గొన్నారు. అలాగే నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి వెనుకబడిన తరగతుల్లో సామాజిక చైతన్యం రగిలించిన వీరవణిత చాకలి ఐలమ్మ అని పరిగి ఎమ్మెల్యే కె.మహే్‌షరెడ్డి అన్నారు.

పరిగి పట్టణ కేంద్రంలో టీఆర్‌ఎస్‌, రజకసంఘం, సీపీఎం, సీపీఐలతోపాటు, వివిధ సంఘాల అధ్వర్యంలో వేర్వేరుగా ఐలమ్మకు నివాళి అర్పింఆచరు. పరిగిలో కోర్టు కాంపౌండ్‌ పక్కన ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఐలమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన కోసం భూమిపూజ చేశారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ ఎం.అశోక్‌, ఎంపీపీ అరవింద్‌రావు, జడ్పీటీసీ బి.హరిప్రియ, ఏఎంసీ చైర్మన్‌ సురేందర్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ భాస్కర్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు ఆంజనేయులు, నాయకులు కల్లు శ్రీనివాసరెడ్డి, బి.ప్రవీణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దోమ మండల పరిధిలోని ఐనాపూర్‌, బడెంపల్లి గ్రామాల్లో ఐలమ్మ వర్థంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూల మాలలువేసి నివాళులర్పించారు. సర్పంచ్‌లు మల్లేశ్‌, కవితా శ్రీనివాస్‌, నాయకులు దామోదర్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ బుగ్గయ్య, మల్లన్న, వెంకటయ్య, అంజి తదితరులు పాల్గొన్నారు.

పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరవనిత ఐలమ్మ అని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బుస్స చంద్రయ్య అన్నారు. కొడంగల్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట వీఆర్‌ఏలతో కలిసి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వీఆర్‌ఏల సంఘం మండల ఉపాధ్యక్షురాలు సంధ్యారాణి, లలిత, మోహన్‌, శ్రీనివాస్‌, రఘు, ఆంజనేయులు, నర్సిములు తదితరులు పాల్గొన్నారు. అలాగే అంబేద్కర్‌ యువజన సంఘం, రజక సంఘం ఆధ్వర్యంలో స్థానిక ప్రధాన చౌరస్తాలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రజక సంఘం మండల అధ్యక్షుడు అశోక్‌, అంబేద్కర్‌ యువజన సంఘం తాలూకా అధ్యక్షుడు యు.రమేశ్‌బాబు, రజక సంఘం పట్టణ అధ్యక్షుడు ముత్యప్ప, నందారం శ్రీశైలం, పర్సాపూర్‌ నాగప్ప, ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్‌ కమిటీ సభ్యుడు కే.దస్తప్ప, ఎం.వెంకటేశ్‌, జీ.అశోక్‌, రజక సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. బొంరా్‌సపేట్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట వీఆర్‌ఏలు వీరనారి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. వీఆర్‌ఏలు మోహన్‌, రాజ్‌కుమార్‌, రఘు, భీములు, రమేశ్‌, నర్సమ్మ, రాములు తదితరులు పాల్గొన్నారు.

పూడూర్‌ మండలం మన్నెగూడలో రజక సంఘం జిల్లా నాయకులు ప్రభాకర్‌ ఆధ్వర్యంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు శ్రీనివా్‌సరెడ్డి, మండలాధ్యక్షుడు సురేందర్‌, ఎంపీటీసీ లక్ష్మణ్‌, మాజీ సర్పంచ్‌ సత్యనారాయణరెడ్డి, నాయకులు సామెల్‌, బుచ్చయ్య, గోపాల్‌, మల్లేశ్‌, జంగయ్య, రాములు, శేఖర్‌, యాదయ్య, రవి, భీమయ్య, తిరుపతయ్య, ఎన్‌ఎ్‌సయూఐ వికారాబాద్‌ జిల్లా ఉపాధ్యక్షుడు సైఫ్‌ సల్మాన్‌ తదితరులు పాల్గొన్నారు. తాండూరులో రజకసంఘం ఆధ్వర్యంలో ఐలమ్మకు ఘనంగా నివాళులర్పించారు. ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఐలమ్మ అమర్‌ హే.. అంటే నినాదాలు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కమిషన్‌ సభ్యులు శుభప్రద్‌పటేల్‌, జిల్లా గ్రంఽథాలయ సంస్థ చైర్మన్‌ రాజుగౌడ్‌, జాతీయ బీసీ సంఘం నాయకులు నాయకులు రాజ్‌కుమార్‌, టీజేఎస్‌ ఇన్‌చార్జి, కౌన్సిలర్‌ సోమశేఖర్‌, కాంగ్రెస్‌ పట్టణాధ్యక్షులు, కౌన్సిలర్‌ ప్రభాకర్‌గౌడ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న, వైస్‌చైర్మన్‌ దీప, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ సునీత, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె శ్రీనివాస్‌, బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి షుకూర్‌, తదితరులు నివాళులర్పించారు.

ధారూరు రజక సంఘం ఆధ్వర్యంలో ధారూరులో కమాన్‌ వద్ద చాకలి ఐలమ్మ చిత్రపటానికి రజకులు పూలమాలలువేసి నివాళులుర్పించి పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రజక సంఘం నాయకులు రవికుమార్‌, సాయి, అంజయ్య, సాయిలు, సుదర్శన్‌, నర్సింలు,  బాలకృష్ణ, బిచ్చయ్య, శేఖర్‌, బాలు, రాజు, తదితరులు పాల్గొన్నారు.  అలాగే తాండూరు మండలం చెంగోల్‌లో మండలానికి చెందిన తాండూరు జడ్పీటీసీ గౌడి మంజుల గ్రామంలోని ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆమెను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గౌడి వెంకటేశం, చాకలి వెంకటయ్య, ఉపాధ్యాయుడు రాంచందర్‌ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. 

  • మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా పరిధిలో

మేడ్చల్‌/ఘట్‌కేసర్‌/ఘట్‌కేసర్‌ రూరల్‌/కీసర : చాకలి ఐలమ్మ వర్థంతిని శనివారం మేడ్చల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేడ్చల్‌ పట్టణం, గౌడవెల్లిలో ఐలమ్మ విగ్రహాలకు పూలమాలలువేసి నివాళులర్పించారు. మండల పరిషత్‌ కార్యాలయంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ ఎంపీపీ పద్మజగన్‌రెడ్డి, సర్పంచ్‌ సురేందర్‌ముదిరాజ్‌, నాయకులు పంజాగారి ఆంజనేయులు, మర్రి నర్సింహారెడ్డి, జగన్‌రెడ్డి, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా చాకలి ఐలమ్మను నేటితరం ప్రజలు ఆదర్శంగా తీసుకోవాలని పోచారం మున్సిపల్‌ చైర్మన్‌ కొండల్‌రెడ్డి అన్నారు. అన్నోజిగూడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైస్‌చైర్మన్‌ రెడ్డియానాయక్‌, నాయకులు శేఖర్‌, రాజేశ్వర్‌ రెడ్డి, కెఎంరెడ్డి, సహదేవ్‌, నర్సింహ, చక్రపాణి, మహేష్‌ తధితరులు పాల్గొన్నారు.

అలాగే కీసర రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వర్థంతి వేడుకల్లో భాగంగా పలువురు ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్పంచ్‌ మాఽధురీ వెంకటేష్‌, సహకార సంఘం చైర్మన్‌ రామిడి ప్రభాకర్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ తటాకం లక్ష్మణ్‌ శర్మ, ఎంపీటీసీ నారాయణ శర్మ, మాజీ ఎంపీటీసీ రాయిల శ్రవణ్‌కుమార్‌ గుప్తా, మాజీ ఎంపీటీసీలు రమే్‌షగుప్తా, జంగయ్యయాదవ్‌, కీసర రజక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వీర వనిత ఐలమ్మ అని కాచవానిసింగారం సర్పంచ్‌ కొంతం వెంకట్‌రెడ్డి తెలిపారు. ఘట్‌కేసర్‌ మండల పరిధి కాచవానిసింగారం గ్రామపంచాయతీలో శనివారం చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తొలి మహిళ చాకలి ఐలమ్మ అని ఈ సందర్భంగా ఆమెను కొనియాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ పోరాటం మరువలేనివని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Read more