కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇవ్వాలి

ABN , First Publish Date - 2022-11-12T00:17:47+05:30 IST

వాణిజ్య సముదాయాలు గల భవనాలకు సంబంధించిన కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రైవేటు జూనియర్‌ కళాశాలల యాజమాన్య సంఘం రాష్ట్ర కమిటీ శుక్రవారం మంత్రి సబితారెడ్డికి వినతిపత్రం అందజేశారు.

కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇవ్వాలి

వికారాబాద్‌, నవంబరు 11 : వాణిజ్య సముదాయాలు గల భవనాలకు సంబంధించిన కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రైవేటు జూనియర్‌ కళాశాలల యాజమాన్య సంఘం రాష్ట్ర కమిటీ శుక్రవారం మంత్రి సబితారెడ్డికి వినతిపత్రం అందజేశారు. నగరంలో ఇంటర్మీడియట్‌ బోర్డు సమావేశం జరుగుతున్న సందర్భంగా టీపీజేఎంఏ రాష్ట్ర అధ్యక్షులు గౌరి సతీష్‌, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతిరెడ్డి తదితరులు మంత్రిని ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాదర్శిని కలిసి సమస్య తీవ్రతను వివరించడం జరిగిందని వారు తెలిపారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించి రెండు సంవత్సరాలకు మిక్స్‌డ్‌ ఆక్యుపెన్సీ కళాశాలలకు హోంశాఖ నుంచి మినహాయింపు తీసుకొని అనుబంధ గుర్తింపు ఇస్తామన్నారు. ఆ తర్వాత కళాశాలలను వేరే భవనాల లోకి మార్చుకోవాలని సూచించారు. టీపీజేఎంఏ నాయకులు బాలకృష్ణారెడ్డి, పార్థసారధి, అమర్‌నాథ్‌రెడ్డి, ఇంద్రాసేనారెడ్డి, వెంకట్‌రెడ్డిలున్నారు.

Updated Date - 2022-11-12T00:17:48+05:30 IST