జీవో 58 దరఖాస్తుల సర్వేకు అదనపు టీంలు

ABN , First Publish Date - 2022-06-07T05:30:00+05:30 IST

జీవో 58 దరఖాస్తుల సర్వేకు అదనపు టీంలు

జీవో 58 దరఖాస్తుల సర్వేకు అదనపు టీంలు
బాలానగర్‌ మండలం ఫతేనగర్‌లో 58 జీవో దరఖాస్తులను పరిశీలిస్తున్న జిల్లా స్పోర్ట్స్‌ అధికారి బలరాం, సిబ్బంది

  • రోజూ వెయ్యి చొప్పున దరఖాస్తుల పరిశీలనకు మొత్తం 29 బృందాలు

మేడ్చల్‌, జూన్‌ 7(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రభుత్వం విడుదల చేసిన జీవో 58కి మేడ్చ ల్‌ జిల్లాలో చేసుకున్న దరఖాస్తుల పరిశీలన కు అదనపు టీంల సంఖ్యను పెంచారు. ఈ టీంలు మంగళవారం నుంచి దరఖాస్తుల పరిశీలన చేపట్టాయి. జిల్లాలో ఎక్కువగా కాప్రా మున్సిపాలిటీ పరిధిలో పదివేలకుపైగా, కుత్బుల్లాపూర్‌లో తొమ్మిది వేలకుపై గా, కూకట్‌పల్లిలో నాలుగు వేలపైగా దరఖాస్తులొచ్చాయి. ఈ మూడు ప్రాంతాల్లో కొత్తగా నియమించిన టీంలను కేటాయించారు. కాప్రాకు ఆరు టీంలు, కుత్బుల్లాపూర్‌నకు 4, కూకట్‌పల్లికి రెండు టీంల చొప్పున కేటాయించారు. జీవో 58 కింద దరఖాస్తులు చేసుకున్న వాటిని పరిశీలించేందుకు మొదట జిల్లాలో 17టీంలను నియమించారు. ఒక్కో టీంలో ముగ్గురు సభ్యులుగా ఉంటారు. ఒక జిల్లా అధికారితోపాటు మరో ఇద్దరు ఉంటారు. జిల్లాలో మే 28 నుంచి దరఖాస్తు ల పరిశీలన చేపట్టారు. జిల్లాలో ఇప్పటి వరకు ప్రభుత్వ, నాన్‌ రిజిష్టర్డ్‌ ప్లాట్లలో నిర్మిం చుకున్న 3,500 గృహాలపై సర్వేలు చేశారు. సర్వేలు మందకొడిగా సాగుతున్నాయని అదనపు కలెక్టర్‌ నర్సింహారెడ్డి మరో 12టీంలను నియమించారు. జిల్లాలో మొత్తంగా 29టీంలు జీవో-58 దరఖాస్తులను పరిశీలి స్తున్నాయి. మొత్తం 38,500 దరఖాస్తులొచ్చాయి. రోజుకు 200 నుంచి 300 దరఖాస్తులను పరిశీలించి నివేదికలు ఇస్తుండడంతో సర్వే పూర్తికి మరో 12టీంలను కేటాయించారు. రోజూ వెయ్యి చొప్పున దరఖాస్తులు పరిశీలించాలని అదనపు కలెక్టర్‌ టార్గెట్‌గా పెట్టుకున్నారు. జిల్లాలో 15 మండలాలకు జీవో 58 పర్యవేక్షణకు ప్రత్యేకాధికారులుగా వివిధ శాఖల అధికారులను నియమించారు. ప్రధానంగా ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకు న్న వారికే ఈ జీవో ద్వారా ప్లాట్ల క్రమబద్ధీక రణ కలగనుంది. ఆ ఇళ్లు కూడా 2014 జూ న్‌కు ముందే నిర్మితమై ఉండాలి. దేవాదాయ, అసైన్డ్‌, వక్ఫ్‌ భూముల్లో నిర్మించుకున్న ఇళ్లకు జీవో 58లో కింద రెగ్యులరైజ్‌ చేయరని అధికారులు పేర్కొన్నారు.

Updated Date - 2022-06-07T05:30:00+05:30 IST