రాష్ట్రంలో వెల్లివిరుస్తున్న ఆదర్శ గ్రామాలు

ABN , First Publish Date - 2022-09-30T05:48:28+05:30 IST

రాష్ట్రంలో వెల్లివిరుస్తున్న ఆదర్శ గ్రామాలు

రాష్ట్రంలో వెల్లివిరుస్తున్న ఆదర్శ గ్రామాలు
పెండ్లిమడుగులో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆనంద్‌

  • మీతో నేను కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్‌ ఆనంద్‌

వికారాబాద్‌, సెప్టెంబరు 29 : రాష్ట్రంలో ఆదర్శ గ్రామాలు వెల్లివిరుస్తున్నాయని వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ ఆనంద్‌ అన్నారు. గురువారం మండల పరిధిలోని పెండ్లిమడుగులో మీతో నేను కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఊరి మధ్యలో ఉన్న రెండు ట్రాన్స్‌ఫార్మర్లను మరో ప్రదేశానికి మార్చాలని, అవసరమైన చోట ఇంటర్‌ పోల్స్‌ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. పంట పొలాల్లో వేలాడుతున్న విద్యుత్‌ తీగలను సరిచేయాలని సూచించారు. సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శిని గ్రామంలో పారిశుధ్య పనుల నిర్వహణపై అభినందించారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి బతుకమ్మ చీరలను అందజేశారు. ఎంపీపీ చంద్రకళ, సర్పంచ్‌ బుచ్చిరెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

  • టీఆర్‌ఎస్‌లో పలువురి చేరిక

పెండ్లిమడుగు గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ నాయకులు కమాల్‌రెడ్డి, ఎస్‌ సుధాకర్‌రెడ్డిలు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎ్‌సలో చేరారు. అదేవిధంగా ఎమ్మెల్యే నివాసంలో మండలంలోని జైదుపల్లికి చెందిన సర్పంచ్‌ ఎల్లమ్మ లక్ష్మణ్‌, వార్డు సభ్యులు రాజశేఖర్‌, రాజు, నాగేష్‌, నాయకులు కృష్ణయ్య, అనంతయ్య, మాణిక్యం, అజయ్‌తోపాటు 60 మంది ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరారు.


Read more