అఘాయిత్యం చేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-06-07T05:37:26+05:30 IST

అఘాయిత్యం చేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలి

అఘాయిత్యం చేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలి
తాండూరులో రోడ్డుపై ధర్నా చేస్తున్న ఏబీవీపీ నాయకులు

తాండూరు/తాండూరు రూరల్‌/కులకచర్ల/దోమ/ వికారాబాద్‌/దౌల్తాబాద్‌, జూన్‌ 6: నగరంలో మైనర్‌ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని సోమవారం తాండూరులో ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించారు. నిందితుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మౌనేశ్వరచారి మాట్లాడుతూ ఐదు రోజుల క్రితం  ఎఫ్‌ఐఆర్‌ బుక్‌ చేసినా ఇప్పటి వరకు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో బాలికలకు రక్షణ కరువైందన్నారు. బాలికకు న్యాయం చేయకుంటే పెద్దఎత్తున ధర్నాలు చేస్తామన్నారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీకాంత్‌గౌడ్‌, కొండల్‌రెడ్డి, వినోద్‌, నవీన్‌గౌడ్‌, శివ, విష్ణు, శ్రీకాంత్‌, రవితేజ పాల్గొన్నారు. బాలికపై అఽఘాయిత్యానికి పాల్పడిన ఎమ్మెల్యే కుమారుడిని అరెస్టు చేయాలని హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో సోమవారం బీజేపీ, బీజేవైఎం చేపట్టిన ఆందోళనకు వెళుతున్న తాండూరు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. వారిలో యు.రమే్‌షకుమార్‌, సుదర్శన్‌గౌడ్‌, రామకృష్ణ, పాండు, తాండ్ర నరేష్‌ ఉన్నారు. తాండూరు మండల నాయకులను కరన్‌కోట్‌ పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా కిసాన్‌ మోర్చా ఉపాధ్యక్షుడు సంజీవరెడ్డి, బీజేపీవైఎం మండలాధ్యక్షుడు కె.నరేందర్‌యాదవ్‌, తుల్జారాం ఉన్నారు. అరె్‌స్టలతో నిజాలు ఆపలేరని బీజేపీ కుల్కచర్ల మండల అధ్యక్షుడు మైపాల్‌ తెలిపారు. బాలికపై అఘాయిత్యం కేసులో ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. వికారాబాద్‌లో నిరసన కార్యక్రమానికి వెళ్లకుండా పోలీ్‌సలు నాయకులు, కార్యకర్తలను అరెస్ట్‌ చేశారు. దోమ నుంచి వికారాబాద్‌కు వెళ్లకుండా బీజేవైఎం, ఆర్‌ఎ్‌సఎస్‌ కార్యకర్తలను పోలీసులు పీఎ్‌సకు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. నాయకులు బంధయ్య, మహేశ్‌ ఉన్నారు. బీజేపీ, యువమోర్చా నాయకులను వికారాబాద్‌లో పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్రం అత్యాచారాలకు, హత్యలకు అడ్డాగా మారిందన్నారు. అరెస్ట్‌ అయిన వారిలో బీజేపీ జిల్లా నాయకులు పాండుగౌడ్‌, బుస్సా శ్రీకాంత్‌, వివేకానందరెడ్డి, నవీన్‌ ఉన్నారు. దౌల్తాబాద్‌లో బీజేపీ నాయకులను అరెస్టు చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు సతీశ్‌, కుండ్రు నర్సిములు, పోతుల బుగ్గప్ప, మోహన్‌రెడ్డి, అశోక్‌, రాములును స్టేషన్‌కు తరలించారు. అనంతరం విడుదల చేశారు.

Updated Date - 2022-06-07T05:37:26+05:30 IST