-
-
Home » Telangana » Rangareddy » Abhivirdhe Aikta Foundation Mission-MRGS-Telangana
-
అభివృద్ధే ఐక్యతా ఫౌండేషన్ ధ్యేయం
ABN , First Publish Date - 2022-09-28T05:04:31+05:30 IST
అభివృద్ధే ఐక్యతా ఫౌండేషన్ ధ్యేయం

ఆమనగల్లు, సెప్టెంబరు 27: గ్రామాలు, గిరిజన తండాల్లో అభివృద్ధే ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి తెలిపారు. మండలంలోని రాంనుంతల గ్రామంలో మంగళవారం రాఘవేందర్‌రెడ్డి పర్యటించారు. సమస్యలు తెలుసుకొని సుంకిరెడ్డి తండాలో ముత్యాలమ్మ ఆలయ నిర్మాణానికి రూ.5లక్షలు విరాళాన్ని ప్రకటించారు. అదేవిదంగా వాటర్‌ఫిల్టర్ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. అనంతరం సుంకిరెడ్డిని తండా నాయకులు పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రవి, ఫౌండేషన్ సభ్యులు వరప్రసాద్‌రెడ్డి, సురేశ్‌రెడ్డి, గన్నోజు సత్యం, ఉమామహేశ్వర్, చంద్రశేఖర్, మల్లేశ్, భాస్కర్, తావుర్య, జగన్, రవి, శంకర్, నరేందర్, బన్సి, గిరీధర్ పాల్గొన్నారు.