మహిళ మెడలో పుస్తెలతాడు అపహరణ

ABN , First Publish Date - 2022-09-19T05:38:48+05:30 IST

మహిళ మెడలో పుస్తెలతాడు అపహరణ

మహిళ మెడలో పుస్తెలతాడు అపహరణ

కీసర రూరల్‌, సెప్టెంబర్‌ 18 :  ఓ మహిళ మెడలోంచి గుర్తుతెలియని దుండగులు పుస్తెలతాడు లాక్కెల్లిన ఘటన కీసర పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ రఘువీర్‌రెడ్డి కథనం ప్రకారం.. నాగారం మున్సిపాలిటీ సత్యనారాయణ కాలనీలో నివసించే దాచపల్లి  హైమావతి ఉదయం ఇంటి పనుల్లో భాగంగా గేటు ముందు కలాపి చల్లి.. ఇంట్లోకి వెళ్లే క్రమంలో ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి ఆమె వెనకాల నుంచి సుమారు 5తులాల బరువున్న పుస్తె, పెస్తెలతాడును ఆమె మెడలోంచి తెంచుకుని క్షణాల్లో మాయమయ్యారు. ఒక్కసారిగా అవాక్కయిన ఆ మహిళ తేరుకుని కేకలు వేసింది. దీంతో స్థానికులు దుండగులను వెంబడించినా ఫలితం లేకుండా పోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని, దొంగలను గుర్తించేందుకు స్థానికంగా ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.


Read more