ముజాహిత్‌పూర్‌లో మేకల అపహరణ

ABN , First Publish Date - 2022-07-06T05:26:07+05:30 IST

ముజాహిత్‌పూర్‌లో మేకల అపహరణ

ముజాహిత్‌పూర్‌లో మేకల అపహరణ

  • అర్ధరాత్రి వాహనంలో వచ్చి ఎత్తుకెళ్లిన దుండగులు

కులకచర్ల, జూలైౖ 5 : మండల పరిధిలోని ముజాహిత్‌పూర్‌ గ్రామంలో మేకలు అపహరణకు గురయ్యాయి. గ్రామానికి చెందిన చిట్యాల వెంకటయ్య తనకున్న ఐదు మేకలను సోమవారం రాత్రి ఇంటి పక్కన గల దొడ్డిలో కట్టేశాడు. అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఓ వాహనంలో వచ్చి మేకలను అపహరించుకుపోయారు. మంగళవారం తెల్లవారుజామున వెంకటయ్య దొడ్డి వద్దకు వెళ్లగా.. మేకలు కనిపించలేదు. దీంతో అక్కడి పరిసరాలు పరిశీలించగా ఓ వాహనం అక్కడికి వచ్చినట్లు గుర్తులు కనిపించాయి. వెంటనే ఈ విషయమై అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దొంగిలించిన మేకల విలువ దాదాపు రూ.80,000 ఉంటుందని బాధితుడు తెలిపాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్‌లు తెలిపారు.

Read more