చికిత్స పొందుతూ యువకుడు మృతి

ABN , First Publish Date - 2022-10-12T05:11:48+05:30 IST

చికిత్స పొందుతూ యువకుడు మృతి

చికిత్స పొందుతూ యువకుడు మృతి

శంషాబాద్‌రూరల్‌, అక్టోబరు 11: మహిళను పెళ్లి చేసుకుంటానని వెంటపడి ఆమె కాదనడంతో ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్న యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన శంషాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ శ్రీధర్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. తొండుపల్లి కిషన్‌గూడ గ్రామానికి చెందిన ఓ మహిళకు 2012లో గండిగూడకు చెందిన మహే్‌షగౌడ్‌తో వివాహమైంది. అయితే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో ఆ మహిళ తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన మహ్మద్‌ ఆరీఫ్‌ అనే యువకుడు ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆ మహిళ తిరిగి భర్త వద్దకు వెళ్లింది. దీంతో మహ్మద్‌ఆరీఫ్‌ ఆమెను పెళ్లి చేసుకుంటానని వేధించాడు. ఈనెల 7న ఇంట్లో మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె వద్దకు వెళ్లి ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని  నిప్పంటించుకోగా ఆ మహిళకూ మంటలు అంటుకున్నాయి. ఇద్దరినీ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈక్రమంలో మహ్మద్‌ఆరీఫ్‌ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీధర్‌కమార్‌ తెలిపారు. 

Read more