నిద్రిస్తున్న వ్యక్తిపై నుంచి దూసుకెళ్లిన ట్రాక్టర్‌

ABN , First Publish Date - 2022-11-12T00:13:49+05:30 IST

రాత్రి పూట పొలం వద్ద నిద్రిస్తున్న వ్యక్తిపై నుంచి ట్రాక్టర్‌ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

నిద్రిస్తున్న వ్యక్తిపై నుంచి దూసుకెళ్లిన ట్రాక్టర్‌

  • అక్కడికక్కడే దుర్మరణం

షాద్‌నగర్‌ రూరల్‌, నవంబరు 11: రాత్రి పూట పొలం వద్ద నిద్రిస్తున్న వ్యక్తిపై నుంచి ట్రాక్టర్‌ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఎలికట్ట శివారులో గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఎలికట్టకు చెందిన నక్క శ్రీనివాస్‌, కుంటి కుమార్‌(38)లు ట్రాక్టర్‌తో పొలం దున్నడానికి రాత్రి వెళ్లారు. ముందుగా కుమార్‌ ట్రాక్టర్‌తో భూమి దున్ని అక్కడే గట్టుపై నిద్రించాడు. అనంతరం శ్రీనివాస్‌ దున్నుతూ నిద్రిస్తున్న కుమార్‌పై నుంచి ట్రాక్టర్‌ను తీశాడు. దీంతో కుమార్‌ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కుమార్‌ మృతదేహన్ని షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య మాధవి పిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నవీన్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - 2022-11-12T00:13:49+05:30 IST

Read more