-
-
Home » Telangana » Rangareddy » A special initiative for economic development of women-MRGS-Telangana
-
మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక చొరవ
ABN , First Publish Date - 2022-09-20T05:22:33+05:30 IST
మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక చొరవ

ఆమనగల్లు, సెప్టెంబరు 19: మహిళల సంక్షేమం, ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోందని డీసీసీబీ డైరెక్టర్, ఆమనగల్లు పీఏసీఎస్ చైర్మన్ గంప వెంకటేశ్ అన్నారు. మండల మహిళా సమాఖ్య నూతన అధ్యక్షురాలిగా ఎన్నికైన శోభారాణికి సోమవారం స్థానిక సింగిల్ విండో కార్యాలయంలో అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. పీఎసీఎస్ పాలక మండలి సభ్యులతో కలిసి శోభారాణిని వెంకటేశ్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో పీఎసీఎస్ వైస్ చైర్మన్ దోనాదుల సత్యం, డైరెక్టర్లు జోగు వీరయ్య, చేగూరి వెంకటేశ్, బెల్లి వెంకటయ్య, దోళ్య నాయక్, మహిళా సంఘం నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు.