చెరువులో చేపల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు

ABN , First Publish Date - 2022-10-13T05:29:34+05:30 IST

చెరువులో చేపల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు

చెరువులో చేపల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు
గల్లంతయిన షబ్బీర్‌ అలీ(ఫైల్‌)

శంషాబాద్‌ రూరల్‌, అక్టోబరు 12: కాముని చెరువులో చేపల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతైన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని మెహదీపట్నానికి చెందిన ఎండీ.షబ్బీర్‌ అలీ (33)మంగళవారం స్నేహితులతో కలిసి కాము ని చెరువులో చేపలవేటకు వెళ్లారు. ప్రమాదవ శాత్తు చెరువులో పడిమునిగిపోయాడు. అతడి స్నేహితులు భయ ంతో అక్కడి నుంచి పరుగులుతీశారు. గజ ఈతగాల్లతో గాలించినా షబ్బీర్‌ మృతదేహం లభించలేదు. ఏసీపీ భాస్కర్‌గౌడ్‌ అధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు. అవసరమైతే ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ బృందాలతో  గాలిస్తామని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Read more