అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-10-15T05:08:12+05:30 IST

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

మేడ్చల్‌, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : అనుమానస్పదస్థితిలో చెరువులో పడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మేడ్చల్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. రావల్‌కోల్‌ గ్రామానికి చెందిన శ్రీను(35) వృత్తిరీత్యా ఆటోడ్రైవర్‌. రావల్‌కోల్‌ చెరువు పెద్దచెరువు వద్ద శుక్రవారం శ్రీను ఆటోను చూసిన గ్రామస్తులు అనుమానంతో చెరువులో వెతకగా.. మృతదేహం లభించింది. కాగా, శ్రీను చెరువులో ఈతకు వెళ్లి మృతిచెందాడా? లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడా? అని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 


Read more