అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-10-12T05:11:03+05:30 IST

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

శంషాబాద్‌ రూరల్‌, అక్టోబరు 11 : అనుమానాస్పద  స్థితిలో వ్యక్తి మృతిచెందిన సంఘటన మంగళవారం శంషాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ శ్రీధర్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కవ్వగూడకు చెందిన కమ్మరి దామోదర్‌ చారి(45) సోమవారం ఇంటి నుంచి వెళ్లాడు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం గ్రామ శివారులో ఉన్న చెరువులో చారి మృతదేహం లభ్యం కాగా పోలీసులు మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అయితే చారి మృతికి గల కారణాలు తెలియాల్సి వుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Read more