అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-07-03T05:30:00+05:30 IST

అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి

అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి

పూడూర్‌, జూలై 3: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన పూడూర్‌ మండలం మేడిపల్లికలాన్‌ గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది. చెన్‌గోముల్‌ ఎస్సై అనిత తెలిపిన వివరాల మేరకు... మేడిపల్లికలాన్‌కు చెందిన కావలి ప్రభాకర్‌(43) కొన్ని సంవత్సరాలుగా మద్యానికి బానిసై తన భార్యతో తరచూ గొడవ పడుతుండేవాడని స్థానికులు తెలిపారు. ఆరు సంవత్సరాలుగా తన ఇంట్లో ఒక్కడే ఉంటున్నాడని, మూడు రోజులక్రితం మనస్తాపానికి గురై మద్యం మత్తులో ఇంటి ఆవరణలో మృతిచెంది ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు మృతదేహాన్ని పరిగి ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. మేడికొండ గ్రామంలో ఉన్న మృతుడి భార్యకు సమాచారం అందించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.  

Read more