ఊరేసుకొని కార్మికుడు ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-11-30T23:58:49+05:30 IST

ఉద్యోగంపై ఇష్టం లేక మనోవేదనతో ఓ కార్మికుడు హాస్టల్‌ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని హెడ్‌కానిస్టేబుల్‌ సంపత్‌ తెలిపారు.

ఊరేసుకొని కార్మికుడు ఆత్మహత్య

కొత్తూర్‌, నవంబరు 30: ఉద్యోగంపై ఇష్టం లేక మనోవేదనతో ఓ కార్మికుడు హాస్టల్‌ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని హెడ్‌కానిస్టేబుల్‌ సంపత్‌ తెలిపారు. మహారాష్ట్రలోని జాల్నా జిల్లాకు చెందిన విష్ణుమురళీధర్‌ నరదాస్‌(23) ఇద్దరు స్నేహితులతో కలిసి రెండు నెలల క్రితం కొత్తూర్‌ వచ్చి ఓ పరిశ్రమలో పనిచేస్తున్నారు. కొత్తూర్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటున్నారు. పేర్కొన్నారు. ఉద్యోగంపై ఇష్టంలేని విష్ణుమురళీధర్‌ మానసికంగా ఇబ్బందిపడే వాడన్నారు. మంగళవారం రాత్రి స్నేహితులు పడుకున్న సమ యంలో అతడు హాస్టల్‌ గదిలో తాడుతో ఉరేసుకున్నాడన్నారు. స్నేహితులు పోలీసులకు సమాచారమిచ్చారు. మృతదేహాన్ని శవపరీక్ష కోసం షాద్‌నగర్‌ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. విష్ణుమురళీధర్‌ స్నేహితుడు సూరజ్‌భగవత్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని హెడ్‌కానిస్టేబుల్‌ సంపత్‌ తెలిపారు.

Updated Date - 2022-11-30T23:58:49+05:30 IST

Read more