ఘనంగా బతుకమ్మ సంబురాలు

ABN , First Publish Date - 2022-09-25T05:30:00+05:30 IST

ఘనంగా బతుకమ్మ సంబురాలు

ఘనంగా బతుకమ్మ సంబురాలు
కడ్తాల్‌: బాలికల ఉన్నత పాఠశాలలో బతుకమ్మ వేడుకలు

కడ్తాల్‌/తలకొండపల్లి/ఆమనగల్లు/కేశంపేట/షాద్‌నగర్‌అర్బన్‌ /ఇబ్రహీంపట్నం/మంచాల/చేవెళ్ల/షాబాద్‌/యాచారం, సెప్టెంబరు 24: తెలంగాణ సంస్కతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ వేడుకలు జిల్లాలో శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కడ్తాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో ఏబీవీపీ ఆధ్వర్యంలో వేడుకలు జరిపారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు యాదీశ్‌, ఏబీవీపీ నాయకులతో కలిసి రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాశ్‌ వేడుకలను  ప్రాంరభించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీకాంత్‌, విభాగ్‌ కన్వీనర్‌ సందడి శ్రీరామ్‌, నాయకులు మల్లేశ్‌, మురళి, శివ, భగీరథ్‌ పాల్గొన్నారు. అదేవిదంగా తలకొండపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉన్నత పాఠశాలల్లో, ఆమనగల్లు పట్టణంలోని వివేకా విద్యాభారతి ఉన్నత పాఠశాలలో వేడుకలు జరిగాయి.  అదేవిధంగా కేశంపేట మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో బతుకమ్మ వేడుకలు జరిపారు. ఇన్‌చార్జి ఎంఈవో మనోహర్‌, హెచ్‌ఎంలు రసూల్‌, శ్రీనివాసరావు పాల్గొన్నారు. అదేవిధంగా షాద్‌నగర్‌ మరియారాణి శాంతి విద్యానికేతన్‌ పాఠశాలలో ప్రిన్సిపాల్‌ ఫాదర్‌ అలెగ్జాండర్‌ విద్యార్థినులకు బతుకమ్మ విశిష్టతను వివరించారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ప్రభు, సాంస్కృతిక సమన్వయకర్త డా.జి.వెంకటలక్ష్మి, అధ్యాపకులు పాల్గొన్నారు.  మంచాల జడ్పీహైస్కూల్‌లో నిర్వహించిన వేడుకల్లో జడ్పీటీసీ మర్రి నిత్య నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు. మాడ్గులలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. హెచ్‌ఎం రామాంజన్‌రెడ్డి కరస్పాండెంట్లు భీజి, జగన్‌ పాల్గొన్నారు. అదేవిధంగా చేవెళ్ల మండలంలోని సిల్వర్‌డైల్‌ హైస్కుల్‌లో షాబాద్‌ మండలంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో బతుకమ్మ సంబురాలు జరిగాయి. అదేవిధంగా యాచారంలోని మండల పరిషత్‌ కార్యాలయంలో, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఎంపీపీ కొప్పు సుకన్యబాషా, ఎంపీడీవో విజయలక్ష్మి, ఏపీఎం సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Read more