బస్టాండ్‌లో కంట్రోలర్‌ను ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2022-09-11T05:24:14+05:30 IST

బస్టాండ్‌లో కంట్రోలర్‌ను ఏర్పాటు చేయాలి

బస్టాండ్‌లో కంట్రోలర్‌ను ఏర్పాటు చేయాలి

కొందుర్గు, సెప్టెంబరు 10: కొందుర్గు ఆర్టీసీ బస్టాండ్‌లో కంట్రోలర్‌ను ఏర్పాటు చేయాలని స్థానికులు డిపో మేనేజర్‌ సురేఖను కోరారు. స్థానిక బస్టాండ్‌ ఆవరణలో శనివారం షాద్‌నగర్‌ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో ‘ప్రజల వద్దకు ఆర్టీసీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రయాణికులు బస్టాండ్‌లో నెలకొన్న సమస్యలను డీఎం సురేఖ దృష్టికి తెచ్చారు. ప్రయాణికుల కోరిక మేరకు తొందరలోనే కంట్రోలర్‌ను ఏర్పాటు చేస్తామని డీఎం చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కావలి యాదయ్య, మాజీ సర్పంచ్‌ బండమీది పెంటయ్య, అసిస్టెంట్‌ మేనేజర్‌ అనందరావు, ఆర్టీసీ సిబ్బంది అర్జున్‌కుమార్‌, భూషన్‌ పాల్గొన్నారు. 

Read more