-
-
Home » Telangana » Rangareddy » A constant struggle on behalf of the poor-MRGS-Telangana
-
పేదల పక్షాన నిరంతర పోరాటం
ABN , First Publish Date - 2022-09-20T05:20:04+05:30 IST
పేదల పక్షాన నిరంతర పోరాటం

ఆదిభట్ల, సెప్టెంబరు 19: పేదల పక్షాన నిరంతర పోరాటం సాగిస్తామని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మధు సూదన్ రెడ్డి అన్నారు. ఆదిభట్ల మున్సిపాలిటి బొంగ్లూరు పీఎ్సజీ కన్వెన్షన్హాల్లో సోమవారం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అసైన్డ్ భూముల రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు బోడ సామేల్, వ్యవసాయ కార్మికసంఘం జిల్లా కార్యదర్శి కందుకూరి జగన్, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు జగదీష్, నాయకులు పాల్గొన్నారు.