-
-
Home » Telangana » Rangareddy » A case against the husband-NGTS-Telangana
-
కౌన్సిలర్‌ను దూషించిన చైర్పర్సన్ భర్తపై కేసు
ABN , First Publish Date - 2022-10-11T05:38:25+05:30 IST
కౌన్సిలర్‌ను దూషించిన చైర్పర్సన్ భర్తపై కేసు

ఘట్కేసర్ రూరల్, అక్టోబరు10: ఓ మహిళా కౌన్సలర్‌ను అసభ్యకరంగా దూషించిన ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ భర్త, ఇద్దరు కౌన్సలర్లు, మరో ముగ్గురు నా యకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ అశోక్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపల్ చైర్పర్సన్ భర్త జంగయ్యయాదవ్, కౌన్సలర్లు మల్లేష్, రవీందర్, నాయకులు రాజు, రాధాకృష్ణ, దేవేందర్ ఈ నెల 5న మద్యం తాగి మహిళా కౌన్సలర్‌ను అభస్యకరంగా దూషించారు. దూషిస్తున్న మాటలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అవమానికి గురైన మహిళా కౌన్సిలర్ ఈ నెల 6న ఈ ఆరుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గతంలోనూ వీరు మున్సిపల్ వైస్‌చైర్మన్ మాధవరెడ్డి, టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు శ్రీనివా్‌సగౌడ్‌లను సైతం దూషించగా పంచాయితీ పెట్టి పరిష్కరించుకున్నట్టు తెలిసింది.