బైక్‌ను ఢీకొన్న కారు.. వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-07-18T05:30:00+05:30 IST

బైక్‌ను ఢీకొన్న కారు.. వ్యక్తి మృతి

బైక్‌ను ఢీకొన్న కారు.. వ్యక్తి మృతి

పరిగి, జూలై 18: బైక్‌ను కారు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. పరిగి మండలం చిగురాల్‌పల్లికి చెందిన రూబ ఎల్లయ్య, చంద్రయ్యలు సోమవారం ఉదయం బ్రాహ్మణ్‌పల్లి నుంచి స్వగ్రామానికి బైక్‌పై వెళుతుండగా.. పరిగి మండలం గడిసింగాపూర్‌ శివారులో ఎదురుగా వస్తున్న కారు బైక్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో ఎల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. చంద్రయ్యకు గాయాలుకాగా పరిగి ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, పరిగి మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సహాయాన్ని అందజేశారు. జడ్పీటీసీ బి.హరిప్రియ, ఏఎంసీ చైర్మన్‌ సురేందర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు ఆంజనేయులు, ప్రవీణ్‌రెడ్డి తదితరులు పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. 

Read more