-
-
Home » Telangana » Rangareddy » A call for a strike in educational institutions tomorrow-MRGS-Telangana
-
రేపు విద్యాసంస్థల బంద్‌కు పిలుపు
ABN , First Publish Date - 2022-07-19T05:19:10+05:30 IST
రేపు విద్యాసంస్థల బంద్‌కు పిలుపు

షాద్‌నగర్/శంషాబాద్ రూరల్/ఇబ్రహీంపట్నం, జూలై 18: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలికవసతులు కల్పించాలని, ప్రయివేటు పాఠశాలల్లో ఫీజులను నియంత్రించాలని కోరుతూ బుధవారం (రేపు) విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిస్తున్నట్లు ఏఐఎ్‌సఎఫ్, ఎస్‌ఎ్‌ఫఐ సంఘాల నేతలు ఎం పవన్‌చౌహాన్, శ్రీకాంత్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా బంద్‌కు సంబంధించి వాల్‌పోస్టర్‌ను సోమవారం ఆవిష్కరించారు. ఎంఈవో, డీఈవో పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా శంషాబాద్ పరిధిలో విద్యారంగ సమస్యల పరిష్కారానికి రేపు విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా నాయకుడు జి.ఆనంద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అదేవిధంగా ఇబ్రహీంపట్నంలో నిర్వహించనున్న విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని ఏఐఎ్‌సఎఫ్ మండల కార్యదర్శి వెంకటేష్ కోరారు.