‘బూస్టర్‌ డోస్‌’ వేయించుకోవాలి

ABN , First Publish Date - 2022-07-18T05:30:00+05:30 IST

‘బూస్టర్‌ డోస్‌’ వేయించుకోవాలి

‘బూస్టర్‌ డోస్‌’ వేయించుకోవాలి

మేడ్చల్‌, జూలై 18  : కొవిడ్‌ ముప్పు ఇంకా తొలగిపోలేదని, అర్హులందరూ తప్పనిసరిగా బూస్టర్‌ డోస్‌ వేయించుకోవాలని మేడ్చల్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దీపికా నర్సింహారెడ్డి తెలిపారు. సోమవారం మేడ్చల్‌లోని ప్రాథమిక ఆరోగ్య వైద్యకేంద్రంను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొవిడ్‌ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని, రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నవారు ప్రభుత్వ ఆదేశాల మేరకు బూస్టర్‌ డోస్‌ కూడా తీసుకోవాలన్నారు. అనంతరం మున్సిపల్‌ పరిధిలోని పలు వార్డుల్లో పర్యటించి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో కౌన్సిలర్లు నర్సింహాస్వామి, శ్రీనివా్‌సరెడ్డి, ఏఈ సాయిరాంరెడ్డి, రాంచందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read more