మొరాయించిన రైల్వే గేటు

ABN , First Publish Date - 2022-10-04T05:44:31+05:30 IST

మొరాయించిన రైల్వే గేటు

మొరాయించిన రైల్వే గేటు
గేటు వద్ద ఆగిన వాహనదారులు

బషీరాబాద్‌, అక్టోబరు 3: బషీరాబాద్‌(నవాంద్గి) రైల్వే గేటు మొరాయించింది. దీంతో రైళ్లు పావుగంటపాటు ఆగిపోయాయి. సోమవారం రైల్వే గేటు మూసే క్రమంలో రెంటు గేట్లు వేస్తుండగా, ఓ గేటు మూసుకోలేదు. అదే సమయంలో ఇరువైపుల నుంచి ఒక ఎక్స్‌ప్రెస్‌, గూడ్స్‌ వస్తున్నాయి. గేటు పడకపోవడంతో గేట్‌మ్యాన్‌ అధికారులకు సమాచారమిచ్చాడు. అధికారులు రైళ్లను నిలిపేయించి గేటుకు మరమ్మతులు చేయించి రైళ్లు నడిపించారు.

Read more