రాష్ట్రంలో 80లక్షల చేపపిల్లల పెంపకం

ABN , First Publish Date - 2022-11-20T23:59:45+05:30 IST

రాష్ట్రంలో మత్స్యశాఖ ద్వారా 80లక్షల చేప పిల్లల పెంపకాన్ని చేపట్టినట్లు కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌ యాదవ్‌ తెలిపారు.

రాష్ట్రంలో 80లక్షల చేపపిల్లల పెంపకం
ఆమనగల్లు: సురసముద్రం చెరువులో చేప పిల్లలు వదులుతున్న ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌

ఆమనగల్లు/మాడ్గుల, నవంబరు 20: రాష్ట్రంలో మత్స్యశాఖ ద్వారా 80లక్షల చేప పిల్లల పెంపకాన్ని చేపట్టినట్లు కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌ యాదవ్‌ తెలిపారు. ఆమనగల్లు పట్టణంలోని సురసముద్రం చెరువులో ఆదివారం మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేప పిల్లలు వదిలారు. ఈ సందర్బంగా జైపాల్‌ యాదవ్‌ మాట్లాడుతూ కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆరు మండలాల పరిధిలో గల 650 నోటిఫైడ్‌ చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌లలో ఈ ఏడాది 80 లక్షల చేప పిల్లలను వదులుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా వెయ్యి మత్స్యకారుల సొసైటీల ఏర్పాటుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిందని తెలిపారు. మత్స్యకారులు చేపల మార్కెటింగ్‌ వీలుగా ప్రభుత్వం వాహనాలు అందిస్తున్నట్లు తెలిపారు. మత్స్యకారులు సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి రూ.10లక్షలతో కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 13 ఫెడరేషన్లు ఏర్పాటు చేసి రూ.3వేల కోట్లు బడ్జెట్‌ కేటాయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ చైర్మెన్‌ నాలాపురం శ్రీనివా్‌సరెడ్డి, మున్సిఫల్‌ చైర్మన్‌ రాంపాల్‌ నాయక్‌, డీసీసీబీ డైరెక్టర్‌ వెంకటేశ్‌, వైస్‌ చైర్మన్‌ దుర్గయ్య, వైస్‌ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి, మత్య్సకారుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మొక్తాల వెంకటయ్య, ఎర్రవోలు యాదయ్య, సుకీర్తి, తల్లోజు విజయ్‌కృష్ణ, చెన్నకేశవులు, చెక్కాల లక్ష్మణ్‌ పాల్గొన్నారు. అదేవిధంగా మాడ్గుల మండలంలోని ఇర్విన్‌, పాత బ్రాహ్మణపల్లి గ్రామాల చెరువుల్లో ఎమ్మెల్యే చేపపిల్లలను వదిలారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఏమిరెడ్డి జైపాల్‌రెడ్డి, అంబల్ల జంగయ్య గౌడ్‌, పగడాల రవి, బొల్లమోని లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

‘ప్రజాభిమానం ముందు కుట్రలు ఫలించవు’

సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ ప్రజాభిమానం ముందు స్వార్థ శక్తుల కుట్రలు ఫలించవని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌ యాదవ్‌ అన్నారు. గుడితండాకు చెందిన పలువురు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం వైస్‌ఎంపీపీ శంకర్‌నాయక్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఎమిరెడ్డి జైపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌ యాదవ్‌ సమక్షంలో హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఈ కార్యక్రమంలో నాగిళ్ల సర్పంచ్‌ రమేశ్‌ రెడ్డి, నాయకులు వెంకటేశ్‌, లక్‌పతినాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-20T23:59:46+05:30 IST