హైనాల దాడిలో 25 మేక పిల్లలు మృతి

ABN , First Publish Date - 2022-09-18T05:15:28+05:30 IST

హైనాల దాడిలో 25 మేక పిల్లలు మృతి

హైనాల దాడిలో 25 మేక పిల్లలు మృతి
కొట్టం వద్ద మేక పిల్లల కళేబరాలు

యాచారం, సెప్టెంబరు 17: మంతన్‌గౌరెల్లిలో శనివారం తెల్లవారు జామున హైనాలు మేక పిల్లలపై దాడిచేసి 25మేక పిల్లలను కొరికి చంపాయి. వాటి కళేబరాలను చూసి కాపరి వెంకటేష్‌ రోదించాడు. ఇదే ప్రాంతంలో రెండు నెలల క్రితం సైతం హైనాలు పది మేకలను చంపాయి. హైనాలు నల్లగొండ జిల్లా అటవీ ప్రాంతాల నుంచి వచ్చి ఉంటాయని గ్రామస్తులు అన్నారు. సంఘటనా స్థలాన్ని అటవీ శాఖ అధికారులు పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. బాధితుడిని ఆదుకోవాలని సర్పంచ్‌ విజయలక్ష్మి ప్రభుత్వాన్ని కోరారు.

Read more