25 టన్నుల రేషన్‌ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2022-11-25T00:04:09+05:30 IST

లారీలో అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.

25 టన్నుల రేషన్‌ బియ్యం పట్టివేత

కొడంగల్‌ రూరల్‌, నవంబరు 24: లారీలో అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై రవిగౌడ్‌ తెలిపిన వివరాల మేరకు.. గురువారం తెల్లవారుజామున కొడంగల్‌ పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో వాహనాలను తనిఖీ చేస్తుండగా.. తాండూర్‌ నుంచి కర్ణాటకలోని గుర్మిట్‌కల్‌కు లారీలో అక్రమంగా తరలిస్తున్న 25 టన్నుల రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్నారు. దీంతో లారీని పోలీస్‌స్టేషన్‌కు తరలించి డిప్యూటీ తహసీల్దార్‌, సివిల్‌ సప్లై అధికారి గణపతిరావుకు అప్పగించగా పంచనామా అనంతరం డ్రైవర్‌ మాజీద్‌ఖాన్‌, యజమాని ఇల్‌ముద్దీన్‌, రేషన్‌ బియ్యం యజమాని రాజులపై కేసు నమోదు చేశారు.

Updated Date - 2022-11-25T00:04:09+05:30 IST

Read more