111జీవో రద్దు ప్రకటనపై జడ్పీ పాలకవర్గం హర్షం

ABN , First Publish Date - 2022-03-17T04:17:42+05:30 IST

111జీవో ఎత్తివేస్తామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌

111జీవో రద్దు ప్రకటనపై జడ్పీ పాలకవర్గం హర్షం
ప్రభుత్వ నిర్ణయంపై ధన్యవాదాలు తెలుపుతున్న జడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి, పాలకవర్గ ఇతర సభ్యులు

రంగారెడ్డి అర్బన్‌, మార్చి 16: 111జీవో ఎత్తివేస్తామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించ డాన్ని స్వాగతిస్తూ జడ్పీటీసీ సభ్యులతో కలిసి చైర్‌పర్సన్‌ తీగల అనితాహరినాథ్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లాలోని నాలుగైదు మండలాల్లోని 84 గ్రామాలకు గుదిబండగా మారిన 111జీవో ఎత్తివేతపై సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించ డం శుభ పరిణామమని తెలిపారు. బుధవారం జడ్పీలో వారు సమావే శమై మాట్లాడారు. గతంలో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీల అమలుకు చిత్తశుద్ధితో కృషిచేస్తున్నారన్నారు. న్యాయపర ఇబ్బందులు అధిగమించి దశలవారీగా జీవో సడలింపు చేపడతామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించడం సంతోషించదగ్గ విషయ మని తెలిపారు. ఏళ్ల తరబడి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయా గ్రామాల ప్రజలకు సీఎం కేసీఆర్‌ ప్రకటన ఎంతో ఉపశమనం, సంతోషం ఇచ్చిందని, ఆయా గ్రామాల ప్రజల తరపున కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో వైస్‌చైర్మన్‌ గణేష్‌, జడ్పీటీసీలు నీరటి తన్వీరాజు, అనురాధపత్యానాయక్‌, చిన్నోళ్ల జంగమ్మ, యాదయ్య, కాలె శ్రీకాంత్‌, బొక్క జంగారెడ్డి, దశరథ్‌నాయక్‌, వెంకట్‌రామ్‌రెడ్డి, కొందర్గు రాగమ్మ, నాయకుడు రామకృష్ణ తదితరులున్నారు.



Updated Date - 2022-03-17T04:17:42+05:30 IST