రామానుజ విగ్రహ చీఫ్ ఆర్టిటెక్ట్‌ ప్రసాద్‌కు విశ్వకర్మ అవార్డ్

ABN , First Publish Date - 2022-12-06T13:05:09+05:30 IST

ముచ్చింతాల్‌ చిన్న జీయర్ ఆశ్రమంలో రూపొందిన రామానుజ విగ్రహం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది.

రామానుజ విగ్రహ చీఫ్ ఆర్టిటెక్ట్‌ ప్రసాద్‌కు విశ్వకర్మ అవార్డ్

Shamshabad : ముచ్చింతాల్‌ చిన్న జీయర్ ఆశ్రమంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారీ రామానుజ విగ్రహ (Statue of Equality) రూపశిల్పి, చీఫ్ అర్కిటెక్ట్ డిఎన్‌వి ప్రసాద్ స్థపతికి విశ్వకర్మ అవార్డును ప్రదానం చేయనున్నట్టు హిందూ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ చీఫ్ వైదేహి తమన్ వెల్లడించారు. డిసెంబర్ 10, 2022న ఈ అవార్డును ప్రసాద్ స్థపతికి అందించనున్నట్టు వెల్లడించారు. ముంబైలోని యశ్వంతరావు చవాన్ ఆడిటోరియం, నారిమన్ పాయింట్‌లో ఉదయం 10:00 గంటల నుంచి జరిగే అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని ప్రసాద్ స్థపతికి లేఖ ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా సమతామూర్తిగా పేరొందిన భారీ రామానుజ విగ్రహం సహా ప్రవేశ ద్వార రూపకల్పనపై ఫౌండేషన్ ప్రశంసలు కురిపించింది. ఈ విగ్రహం అత్యంత గొప్ప నిర్మాణాలలో ఒకటని వైదేహి తమన్ ప్రశంసించారు. రామానుజాచార్యుల బంగారు విగ్రహం, ప్రవేశద్వారం వద్ద సూక్ష్మ వివరాలతో నిర్మితమైన ప్రామాణిక తోరణాలు మంత్రముగ్దులను చేస్తాయని వైదేహి తమన్ కొనియాడారు.

ఈ అవార్డు ప్రదానోత్సవం రోజునే హిందు ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చి ఫౌండేషన్ కూడా ప్రారంభమౌతుందని తెలిపారు. ఈ ఫౌండేషన్ ద్వారా వేదిక్ మేథ్స్, ఆస్ట్రో మెడిసిన్, భాగవతం, పురాణాలు, విమాన శాస్త్రం, ప్రాచీన నిర్మాణశైలి వంటి భారతీయ శాస్త్రాల అధ్యయనం జరుగుతుందన్నారు.

Updated Date - 2022-12-06T16:58:28+05:30 IST