విద్యార్థిపైకి చెప్పు తీసిన హెచ్‌ఎం

ABN , First Publish Date - 2022-07-27T16:38:54+05:30 IST

బోనఫైడ్‌ ఇవ్వమని అడిగినందుకు ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎం చెప్పుతో విద్యార్థిని కొట్టేందుకు యత్నించింది. ఈ సంఘటన రామంతాపూర్‌లో చోటు చేసుకుంది

విద్యార్థిపైకి చెప్పు తీసిన హెచ్‌ఎం

హైదరాబాద్/రామంతాపూర్‌: బోనఫైడ్‌(Bonafide) ఇవ్వమని అడిగినందుకు ప్రభుత్వ పాఠశాల(Government school) హెచ్‌ఎం చెప్పుతో విద్యార్థిని కొట్టేందుకు యత్నించింది. ఈ సంఘటన రామంతాపూర్‌లో చోటు చేసుకుంది. రామంతాపూర్‌ జిల్లా ప్రజాపరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో చదివిన కట్ట అఖిల్‌ ఉన్నత విద్యాభ్యాసం కోసం బోనఫైడ్‌ సర్టిఫికెట్‌ కావాలని హెచ్‌ఎం స్వరూపరాణికి దరఖాస్తు చేశాడు. సర్టిఫికెట్‌ ఇవ్వకుండా హెచ్‌ఎం ఇబ్బంది పెడుతుండడంతో విద్యార్థి మండల విద్యాధికారికి ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో మంగళవారం పాఠశాలకు వచ్చిన అఖిల్‌ని హెచ్‌ఎం చెప్పుతో కొట్టేందుకు యత్నించారు. ఈ విషయం స్థానికంగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. హెచ్‌ఎం తీరును తప్పుపడుతూ అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. 

అసభ్య పదజాలంతో దూషించినందుకే :  హెచ్‌ఎం

పని ఒత్తిడి కారణంగా బోనఫైడ్‌ సర్టిఫికెట్‌ జారీలో జాప్యం జరిగినట్లు హెచ్‌ఎం స్వరూపరాణి తెలిపారు. ఇదే విషయమై పాఠశాలకు వచ్చిన విద్యార్థి అఖిల్‌ తనను అసభ్య పదజాలంతో దూషించడంతో ఆవేశం తట్టుకోలేక ఆ విధంగా ప్రవర్తించినట్లు, ఈ సంఘటనపై చింతిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

Read more